శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నారీనారీ నడుమ మురారీ' చిత్రంతో హిట్ కొట్టిన శర్వానంద్.. మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు 'బైకర్' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు శర్వానంద్. ఈ మేరకు ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ లో బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. హాలీవుడ్ విజువల్స్ ఈ మూవీలో కనిపిస్తున్నాయి.
ఈ మేరకు ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ బైకర్ అని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు రావడం చాలా అరుదు. ఎప్పుడో ఒకటిగానీ రాదు.. ఆ మూవీస్ ఎక్కువ శాతం క్రికెట్, ఫుట్ బాల్, హాకీ లాంటి క్రీడలకు సంబంధించినవే.. అయితే బైక్ రేసింగ్ స్పోర్ట్స్ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో ఈ మూవీ శర్వానంద్ కెరీర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాబట్టి.. ప్రేక్షకులు కనెక్ట్ అయితే శర్వానంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గ్యారంటీ..
ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా బైకర్ మూవీని రామానాయుడు స్టూడియోస్ లోని ఓ థియేటర్ లో ప్రివ్యూ షోను ప్రదర్శించినట్లు సమాచారం. ఈ షో కు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, మీడియా ప్రతినిధులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక సినిమా చూసిన తర్వాత వాళ్లు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
బైకర్ మూవీలో బైక్ రేసింగ్ సన్నివేశాలతోపాటు, తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ కూడా చక్కగా పండిందని చెబుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కు ఈ మూవీ ద్వారా మంచి పాత్ర దొరికిందని అంటున్నారు. ఇక శర్వానంద్ క్యారెక్టర్ మూవీకే హైలెట్ అని చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో స్క్రీన్ ప్లే కాస్త స్లోగా సాగుతుందని టాక్.

ఇక బైక్ రేసింగ్ సన్నివేశాలు ఇండియాలో ఏ మూవీలో లేని విధంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయని కామెంట్స్ వస్తున్నాయి. మూవీ మొత్తం చాలా రిచ్ గా కనిపిస్తుందని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం తో శర్వానంద్ మరోసారి భారీ హిట్ అందుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3 న ఈ మూవీ విడుదల కానుంది.
-
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications