హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ..
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. అనేక సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయం. మనదేశానికి ఎంతో గణనీయమైన చరిత్ర ఉంది. భారత్ లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, జలపాతాలు, సముద్ర తీర ప్రాంతాలు, దీవులు ఇలా అనేక పర్యటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అయితే భారత్ లో పర్యాటక ప్రాంతాలను చూసి బోర్ కొట్టిందా..? సమ్మర్ లో అలా ఫారెన్ టూర్ వేళ్లాలని అనుకుంటున్నారా..? అయితే వారికి థాయిలాండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
వేసవిలో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యటకులు క్యూ కడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో భారత్ కు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో థాయిలాండ్ ఒకటి. అయితే మనదేశంలోని పర్యటకుల కోసం IRCTC ఓ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరకే బ్యాంకాక్ అందాలను చుట్టేసి రావచ్చు. ఈ టూర్ ప్రస్తుతం ఏప్రిల్ 24 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ వివరాలు చూస్తే..
మొత్తం ఐదు రోజుల థాయిలాండ్ టూర్ లో భాగంగా తొలిరోజు ఉదయం 5 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విమానం బయల్దేరుతుంది. అలా బ్యాంకాక్ విమానాశ్రయానికి ఉదయం 10 గంటల 55 నిమిషాలకు చేరుతుంది. ఇక అక్కడి నుంచి పటాయాకు పర్యటకులు చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత సాయంత్రం అల్కాజర్ క్యాబరే షో లో పాల్గొంటారు. రాత్రికి అక్కడే స్టే ఉంటుంది.
ఇక రెండోరోజు ఉదయం కోరల్ రీఫ్స్ అని పిలువబడే కోరల్ ఐలాండ్ కు బయల్దేరుతారు. ఇక్కడ సందర్శించిన అనంతరం నూచ్ ట్రాఫికల్ గార్డెన్ కు చేరుకుంటారు. రాత్రికి పటాయలోనే స్టే చేస్తారు. అలాగే మూడోరోజు జెమ్స్ గ్యాలరీ, గోల్డెన్ బుద్ధ, మార్బుల్ టెంపుల్ ను సందర్శన ఉంటుంది. అలా రాత్రికి బ్యాంకాక్ లోనే బస ఉంటుంది.

నాలుగోరోజు సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత చావ్ ప్రాయా నదిపై ఓ షిప్ లో డిన్నర్ ఉంటుంది. ఆ రాత్రి బ్యాంకాక్ లో స్టే చేస్తారు. ఇక చివరగా ఐదో రోజు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో థాయిలాండ్ టూర్ ముగుస్తుంది. ఇక టికెట్ ధరలు రూ. 44 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications