కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్

బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కొనసాగుతోంది. నేడు కూడా వీటి రేట్లు కుప్పకూలాయి. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు బంగారం రేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. బలమైన డాలర్, లాభాల స్వీకరణ వంటి కారణాలతో నేడు పసిడి, వెండి నేలచూపులు చూస్తోన్నాయి. వరుసగా పడిపోతున్న వీటి ధరలు కొన్నవారిని బెంబేలెతిస్తోన్నాయి.

కామెక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.48 శాతం క్షీణించి ఔన్సుకు 4,341 డాలర్లకు చేరాయి. వెండి ఫ్యూచర్స్ 3.63 శాతం మేర తగ్గి ఔన్సుకు 66.83 డాలర్ల వద్ద నిలిచాయి. గతంలో ఔన్సుకు 119 డాలర్ల గరిష్ట స్థాయిని తాకిన వెండి ప్రస్తుతం సగానికి పైగా విలువను కోల్పోయింది. దేశ వ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ధరలు కూడా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,350, 22 క్యారెట్లు రూ.1,28,500గా ఉంది.

MCX Gold Slump After Trump Pauses Iran Strikes 24K Gold Drops to Rock-Bottom as Dollar Strengthens

ఎంసీఎక్స్ (MCX)లో ఏప్రిల్ 2 నాటి గోల్డ్ ఫ్యూచర్స్ 1.04 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,37,816 వద్ద ట్రేడ్ అయ్యాయి. మే 5 నాటి వెండి ఫ్యూచర్స్ 3.24 శాతం పడిపోయి కిలోకు రూ. 2,17,816కి చేరాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,28,650, 24 క్యారెట్లురూ. 1,40,500, అహ్మదాబాద్, పూణేలలో 22 క్యారెట్లు రూ. 1,28,550, 24 క్యారెట్లు రూ. 1,40,400గా నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,28,500, 24 క్యారెట్లు రూ.1,40,350గా ఉంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,182, 22 క్యారెట్లు - రూ. 13,000, 18 క్యారెట్లు - రూ. 10,820

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,035, 22 క్యారెట్లు- రూ. 12,865, 18 క్యారెట్లు - రూ. 10,526

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,035, 22 క్యారెట్లు- రూ. 12,865, 18 క్యారెట్లు - రూ. 10,526

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,035, 22 క్యారెట్లు- రూ. 12,865, 18 క్యారెట్లు - రూ. 10,526

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,035, 22 క్యారెట్లు- రూ. 12,865, 18 క్యారెట్లు - రూ. 10,526

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,035, 22 క్యారెట్లు- రూ. 12,865, 18 క్యారెట్లు - రూ. 10,526

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+