చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు, తండ్రీకొడుకులిద్దరూ...: చింతా
చంద్రబాబు నాయుడిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత చింతా మోహన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత చింతా మోహన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
పోలవరం పేరు చెప్పి తండ్రీకొడుకులిద్దరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబును, నారా లోకేష్‌లను ఉద్దేశించి అన్నారు. అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సాధారణ ఎన్నికలకు ముందు బాబువస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. తన ఇంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన చంద్రబాబుపై విరుుకుపడ్డారు.
శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానని చెప్పిన ముద్రగడ యాత్రకు ఆంక్షలు విధించడం సరికాదని ఆయన అన్నరు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే క్కు అందరికీ ఉందని, రాష్ట్ర డిజిపి సాంబశివ రావు టిడిపి నాయకుడిగా మాదిరిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
-
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications