ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్: ఇంతలోనే ఎంత మార్పు, పార్టీకోసం పనిచేసేవారికే పదవులు: చింతమనేని

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలో ఉంటూ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తోందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలో ఉంటూ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తోందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు.

మంత్రివర్గపునర్వవ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్. తనకు మంత్రి పదవి దక్కకుండా తన ప్రత్యర్థి పితాని సత్యనారాయణకు మంత్రి లభించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అవసరమైతే పార్టీని ఏర్పాటు చేస్తాను.పార్టీ మారే సమస్యే లేదని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.అయితే రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిశారు.అయితే బాబును కలిసిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది.

ప్రజలకు అందుబాటులో ఉన్నవారికే కష్టపడి పనిచేసేవారికి పార్టీలో పదవులు కూడ వస్తాయని చింతమనేని ప్రకటించారు.పార్టీ కోసం కష్టపడే వారిని పార్టీ నాయకత్వం గుర్తిస్తోందన్నారు చింతమనేని ప్రభాకర్.శనివారం నాడు పార్టీ నియోజయవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఇంతలో ఎంత మార్పు

ఇంతలో ఎంత మార్పు

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న చింతమనేని ప్రభాకర్ మాట మార్చారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు కట్టబెట్టే చరిత్ర టిడిపిదేనని చెప్పారు.

శనివారం నాడు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అభివృద్దికి అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. సమన్వయంతో పార్టీ నాయకులు కలిసి పనిచేయాలన్నారు.గ్రూపులు కడితే పార్టీకి నష్టం కలుగుతోందన్నారు.

గ్రూపులు కడితే సహించం

గ్రూపులు కడితే సహించం

పార్టీలో గ్రూపులు కడితే సహించబోనని ఆయన హెచ్చరించారు.కష్టించి పనిచేసేవారికి తగిన గుర్తింపుతో పాటుగా కొన్నిసార్లు పదవులు కూడ వస్తాయన్నారు.

పదవులు రాని వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతోందన్నారు. కష్టకాలంలో కూడ ఎత్తిపోతల ద్వారా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకొంటామని చింతమనేని చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.

 మంచి సలహాలను స్వీకరిస్తా

మంచి సలహాలను స్వీకరిస్తా

పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడే సలహాలను తాను తప్పకుండా స్వీకరిస్తానని చింతమనేని ప్రకటించారు. పార్టీ క్యాడర్ అంతా క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీని కాపాడుకొంటే కార్యకర్తలను పార్టీ కాపాడుతోందని ఆయన చెప్పారు. అనంతరం, గ్రామ, మండల స్థాయి కమిటీల ఎన్నికలను నిర్వహించారు.పార్టీని నష్టపరిచే చర్యలను సహించబోనని చెప్పారు.

ఉపాధిహామీ పనులతో రాష్ట్రస్థాయి గుర్తింపు

ఉపాధిహామీ పనులతో రాష్ట్రస్థాయి గుర్తింపు

ఉపాధిహామీ పథకంలో భాగంగా అత్యధికంగా పనులు చేపట్టిన దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

నియోజకవర్గస్థాయిలో రోజుకు 50వేల పనిదినాలతో రోజుకు కోటిరూపాయాలను కూలీలకు అందేలా చూస్తున్నామని చెప్పారు. సీఎం సహాయనిధి నుండి వైద్య సహాయం కింద రూ.8 కోట్లు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

English summary
Don't violate party disciplane said Andhra pradesh governament whip Chintamaneni Prabhakar on Saturday.He participated party meeting at Eluru.who is working for party, party will look after career he said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X