భూమా నాగిరెడ్డిలో మరో కోణం: అప్పుడు అదో సంచలనం, విభజనపై..
భూమా నాగిరెడ్డి ఫ్యాషన్ నుంచి శాంతి వైపు నడిచారు. 2000లలో ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియాత్రలు పెను సంచలనాన్ని సృష్టించించాయి.
ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి ఫ్యాషన్ నుంచి శాంతి వైపు నడిచారు. 2000లలో ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియాత్రలు పెను సంచలనాన్ని సృష్టించించాయి. ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల వర్గీయులతో తమకున్న ఫ్యాక్షన్ కారణంగా ఎంతోమంది మరణించటం, అన్ని వర్గాల్లోనూ బాధితులు అంతకంతకూ పెరగటం భూమాను కదిలించిందని అంటారు.

ఫ్యాక్షన్‌కు చెక్ చెప్పేందుకు
ఫ్యాక్షన్ హింసకు చెక్ చెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన శాంతి యాత్రలు నిర్వహించారు. కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన శాంతి పాదయాత్రలు జరిపారు. దీనిని ఉద్యమరూపంలో నిర్వహించారు.

శాంతియాత్రలో కౌన్సెలింగ్
తన శాంతి పాదయాత్రలో భాగంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇరువర్గాల్ని ఒకచోటకు చేర్చి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ రాజీ చేశారు. న పాదయాత్రతో పలు గ్రామాల్లోని వర్గాల మధ్య విభేదాల్ని ఒక కొలిక్కి తెచ్చిన వైనం అప్పట్లో అందరూ మాట్లాడుకునేలా చేసింది.

రాజకీయంగా తొలి ఓటమి
2004 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భూమా.. గంగుల ప్రతాప్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయంగా ఆయనకు అదే తొలి ఓటమి.

రాయల తెలంగాణ నినాదం
ఏపీ విభజనకు ముందు తెలంగాణ ఉద్యమానికి భూమా తనదైన శైలిలో పరిష్కారం సూచించారు. రాయల సీమను తెలంగాణను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. సీమ ప్రజల భావోద్వేగాలు తెలంగాణ ప్రజల మాదిరే ఉంటాయన్నది ఆయన వాదన. ప్రజారాజ్యం పార్టీలో చేరటానికి ముందు టిడిపిలో ఉన్న సమయంలో ఆయన ఈ నినాదాన్ని సూచించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications