90కోట్ల బకాయిలు: తాత్కాలికంగా నిలిచిన పోలవరం ప్రాజెక్టు పనులు
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు గత రెండ్రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయాయి. స్పిల్ ఛానల్ మట్టి తవ్వకం పనులను ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ మంగళవారం నుంచి ఆవేసింది.
అమరావతి: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు గత రెండ్రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయాయి. స్పిల్ ఛానల్ మట్టి తవ్వకం పనులను ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ మంగళవారం నుంచి ఆవేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంపై ఆందోళన నెలకొంది.
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో మట్టి తవ్వకం పనులు ఆగకూడదు. ఈ పనులను ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంది. కాగా, రూ.90కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండటంతో పోలవరం సబ్ కాంట్రాక్ట్ కంపెనీ మట్టి తవ్వకం పనులను ఆపేసింది. బకాయిలు చెల్లించిన తర్వాతనే పనులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

కాగా, ఒక్క రోజు పనులు ఆపితే ప్రాజెక్టుపై రూ.21కోట్ల భారం పెరుగుతుందని అంచనా. అయితే, పోలవరం ప్రాజెక్టు అధికారులు మాత్రం బుధవారం సాయంత్రంలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం ఉదయం నుంచి మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్ట్ కంపెనీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications