Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్‌కు నాపై దొరికింది పోర్న్ ఒక్కటే: వర్మ, చలపతిరావు వ్యాఖ్యలపై ఇలా...

తనపై ఎదురు దాడి చేయడానికి పవన్ కల్యాణ్‌కు తన విషయంలో దొరికింది పోర్న్ ఒక్కటేనని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు.

హైదరాబాద్: మెగా హీరోల మీద వ్యాఖ్యలు చేయనని అంటూనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు. తాను పవన్ కల్యాణ్ పొలిటికల్ ఐడియాలజీ మీద, ఇతర విషయాల మీద తాను ఎక్కువగా విమర్శలు చేశానని ఆయన అన్నారు.

దాంతో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి, తనకు కౌంటర్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్‌కు తన విషయంలో దొరికింది పోర్న్ ఒక్కటేనని ఆయన అన్నారు. ఎవరి ఆలోచనలు వారివి అని, పోర్న్‌ చూసేవాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడతారని పవన్‌ అనుకుని ఉండవచ్చునని ఆయన అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ అలా అని ఉంటాడని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ

భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ

తనకే కాదు భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్‌ గురించే కాదు, నాగబాబు, చిరంజీవి విషయాల్లో కూడా తాను కొన్ని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అంగీకరించారు. తాను ట్విట్టర్‌ నుంచి బయటకు రావడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పారు. ఈ సందర్భంగా తన కామెంట్ల వల్ల హర్ట్‌ అయిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని వర్మ అన్నారు.

ట్విట్టర్‌ వేదికగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, మెగా హీరోలపై ట్విట్టర్ సమరం సాగించిన విషయం తెలిసిందే. ఒక దశలో వర్మ శృతి మించి వ్యాఖ్యలు చేశారు కూడా. దాంతో నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు.

ఇంటర్వ్యూలో ఇలా..

ఇంటర్వ్యూలో ఇలా..

'ఖైదీ నెంబర్‌ 150' ఆడియో వేడుకలో నాగబాబు వర్మపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 'పొద్దున లేవగానే పోర్న్‌ చూసే వర్మ గురించి నేను మాట్లాడను' అని పవన్‌ ఓ ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. వాటి గురించి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడారు.

చలపతిరావుపై..

చలపతిరావుపై..

మహిళలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై కూడా రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. చలపతిరావుతో తనకు పెద్దగా పరిచయం లేదని అంటూ చలపతి రావు మహిళల గురించి ఏ సందర్భంలో మాట్లాడారో ముందు అర్థం చేసుకోవాలని అన్నారు. సినీ పరిశ్రమలో మహిళల గురించి ఇలాంటి మాటలు ఎంతో మంది దర్శకులు, నటులు మాట్లాడుతారని ఆయన అన్నారు.

సినీరంగంలోనే కాదు.. బయట కూడా ఎంతో మంది ఇంతకంటే దారుణంగా మాట్లాడతారని అన్నారు. అయితే పబ్లిక్‌లో ఇలా మాట్లాడడం తప్పని కొందరంటున్నారని ఆయన అన్నారు. చలపతిరావు ఇలా మాట్లాడకపోతే.. మగవాళ్లు తమ గురించి ఏమనుకుంటారో ఆడవాళ్లకు తెలియదా? లేదా ఆయన ఇలా అన్న తర్వాతనే స్త్రీలపై మగవారి ఆలోచనలు సమాజానికి అర్థమయ్యాయా అని వర్మ అడిగారు.

వారంతా దోషులే

వారంతా దోషులే

ఆ వేడుకలో చలపతిరావు వ్యాఖ్యలను ఎంజాయ్‌ చేసి, తర్వాత తమను తాము సమర్థించుకున్నవాళ్లంతా దోషులేనని అన్నారు. ఇదంతా చూసే వాళ్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌, గొడవ చేసిన వాళ్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+