కొత్త రామాయణం- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్

మచ్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ.. రామాయణ: పార్ట్ 1. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోందీ ఫిల్మ్. నితీష్ తివారీ దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా. అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న సినిమాల్లో ఇదీ ఒకటి. బడ్జెట్, నిర్మాణ వ్యయం హాలీవుడ్ రేంజ్ ను మించిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఏకంగా 4,000 కోట్ల రూపాయలతో సినిమా రూపుదిద్దుకుంటోంది.

రెండు భాగాలుగా రూపొందుతోంది రామాయణ. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి నటిస్తోన్నారు. లంకాధిపతి రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ మెరుపులు మెరిపించనున్నాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస్ నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీనెగ్, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి.

Ranbir Kapoor Divine Transformation as Lord Rama Unveiled in Ramayana Teaser on Hanuman Jayanti

నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో సెట్స్, మేకర్స్ విజన్‌కు ప్రశంసలు దక్కాయి. రణబీర్ కపూర్ రాముడి లుక్‌కు మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. 2 నిమిషాల 38 సెకన్ల ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ రాముడి కనిపించాడు. ఇది అతని ఫస్ట్ లుక్. భక్తి, భావోద్వేగాలతో నిండిన ఈ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. టీజర్‌లో రణబీర్ కపూర్ మినహా ఇతర నటుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. బ్లాక్ షేడ్ లో చూపారు.

"రామ్" అని పిలిచే హనుమంతుడి వాయిస్ లో సన్నీ డియోల్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, సీతాదేవిగా సాయి పల్లవి ముఖాలను 'బ్లర్' చేసి చూపించారు. టీజర్ చివర్లో రావణుడి పాత్రలో యష్ గ్లింప్స్ కనిపించడంతో కొసమెరుపు. పొడవైన దేహం, నలుపు దుస్తులు, కిరీటంతో నడుస్తున్న అతని వీపు భాగం, అలాగే పుష్పక విమానం దృశ్యాలు కనిపించాయి. యష్ ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, అతని ఆరా సోషల్ మీడియాలో లైమ్‌లైట్ ను సొంతం చేసుకుంది. యష్ ఈ పాత్ర కోసమే పుట్టాడంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

రామాయణం టీజర్ విడుదలయ్యాక, పలువురు 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్‌పై వ్యంగ్యంగా స్పందించారు. ఓం రౌత్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లే సమయం వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. "దీన్నే రామాయణం అంటారు, ఓం రౌత్ కచ్చితంగా నేర్చుకోవాలి" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అధికంగా వాడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మేకర్స్ సినిమాకు హాలీవుడ్ స్థాయి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించి, రామాయణానికి ఉండాల్సిన సహజత్వాన్ని కోల్పోయారని వారి అభిప్రాయం.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+