Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, జగన్ లతో పాటు సినీ ప్రముఖులపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ దఫా రాజకీయనాయకులతో పాటు సినీ ప్రముఖులను టార్గెట్ చేశారు.

అమరావతి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ దఫా రాజకీయనాయకులతో పాటు సినీ ప్రముఖులను టార్గెట్ చేశారు. వివాదాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏరకమైన ప్రకంపనలు సృష్టిస్తాయోననే చర్చ సాగుతోంది.

నిత్యం ఏదో రకమైన కామెంట్లు చేస్తూ వివాదాలను ఎదుర్కొనే రామ్ గోపాల్ వర్మ కొంతకాలం వరకు తన నోటికి తాళం వేసుకొన్నారు. కానీ, తాజాగా ఆయన మరోసారి రాజకీయనాయకులు,, సినీ ప్రముఖుల గురించి వ్యాఖ్యలుచేశారు.

పలువురు రాజకీయనేతలు, సినీ ప్రముఖులపై తన అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నవ్వులేని నాయకుడిగా పోల్చాడు. విపక్ష నేత వైఎస్ జగన్ ను సన్ ఇన్ ఇనుము (ఐరన్) తో పోల్చాడు.

 Ramgopal varma controversy comments on Ap polictical leaders and cine actors

హీరో పవన్ కళ్యాణ్ ను రాజకీయ నేతగా చెప్పాడు. అయితే వెయిట్ అండ్ వాచ్ గా పేర్కొన్నాడు. ఇక సినీ రంగ ప్రముఖుల గురించి మరోసారి తన మనసులోని మాటలను ఆయన బయటపెట్టారు.

రాజమౌళిని మెస్సయ్య ఆఫ్ ఫిల్మ్స్, ప్రభాస్ ను సెక్సియెస్ట్ పవర్, జూనియర్ ఎన్టీఆర్ ను రీ పీటింగ్ సీనియర్ ఎన్టీఆర్, నాగార్జున ను లవ్, చిరంజీవిని స్టార్ మెగా, బన్నీని డేంజరస్ రాబిట్, రాంచరణ్ ను ధీరుడైన మగాడుగా, నాగబాబును లవ్ లీ బ్రదర్ అంటూ ఆయన సమాధానమిచ్చాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+