వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్వాఫుడ్ పార్క్ సెగలు: భయకంపితులవుతున్న ప్రజలు, ఇంటింటికీ...

నరసాపురం, భీమవరం మండలాల పరిధిలో ఎప్పుడేమీ జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుందురు, కంసాలి బేతపూడి, జొన్నలగరూవు గ్రామాలు అగ్ని గుండం మాదిరిగా రగులుతున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం మండలాల పరిధిలో ఎప్పుడేమీ జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భీమవరం మండలం తుందురు, కంసాలి బేతపూడి, జొన్నలగరూవు గ్రామాలు అగ్ని గుండం మాదిరిగా రగులుతున్నాయి. ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉధ్రుతంగా ఉద్యమిస్తున్నారు.

దీని ఏర్పాటుతో నీటి వనరులన్నీ పూర్తిగా ధ్వంసమవుతాయని, పర్యావరణం దెబ్బ తింటుందని చెప్తున్నా ప్రభుత్వం మాత్రం పెడచెవిన బెడుతున్నది. దీని ఏర్పాటుతో తమ సాధారణ జీవనం అస్తవ్యస్థంగా మారుతుందని గగ్గోలు పెడుతున్నారు స్థానికులు.

తమ మనోభావాలను పట్టించుకోవాలన్న స్థానికుల అభ్యర్థనను పాలకులు పెడచెవిన బెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్క్ నిర్మాణంలో అవసరమైన యంత్రాలను తరలించేందుకు భారీ కసరత్తే చేశారు. రెండు రోజుల ముందే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేసి మరీ అణచివేత అంటే ఏమిటో గోదావరి జిల్లాల ప్రజలకు రుచి చూపారు.

అడుగడుగునా పోలీసు దమనకాండ

అడుగడుగునా పోలీసు దమనకాండ

ఈ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఆందోళనకారులపై పోలీసులు భయోత్పాతం స్రుష్టించారు. ఆందోళనలో పాల్గొన్న మహిళల్లో గర్భిణులు ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపించాయి. ఏతావాతా ప్రజలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధించారు. ఫలితంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే మగ్గారు. బూటుచప్పుళ్లతో భీతావహ వాతావరణాన్ని తలపించారు. సరిహద్దుల్లో యుద్ధానికి అవసరమైన సామగ్రి తరలింపును తలపించేలా పోలీసులే దగ్గర ఉండి యుద్ధసామగ్రి తరలింపును తలపించేలా ఆక్వాఫుడ్‌పార్క్‌కు కంటెయినర్లలో సామగ్రిని దగ్గరుండి భారీబందోబస్తు మధ్య తరలించారు.

Recommended Video

West Godavari, Tundurru : Godavari Mega Aqua Food Factory is Good Or Bad ?
యంత్రాల తరలింపుపై ఇలా పర్యవేక్షణ

యంత్రాల తరలింపుపై ఇలా పర్యవేక్షణ

ఆందోళనకారులు అడ్డుపడకుండా లాఠీలు, తుపాకులు చేతబట్టి ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ప్రతి ఇంటి వద్దా మోహరించారు. ప్రజలను గడపదాటనివ్వలేదు. తుందుర్రులోని ఆక్వా ఫుడ్‌ఫ్యాక్టరీకి సామగ్రి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం జరిగిన పోలీసుల దమనకాండకు నిరసనగా ప్రదర్శనకు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నిర్ధాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 144 సెక‌్షన్, 30 చట్టం అమల్లో ఉందంటూ భయోత్పాతం సృష్టించారు. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే నిలబడి కంటెయినర్ల తరలింపును మౌనంగాచూస్తూ ప్రేక్షక పాత్ర వహించారు. ఉదయం 11 గంటల నుంచీ యంత్రాలతో కంటెయినర్లు తుందుర్రు ఫ్యాక్టరీ వైపు బయలుదేరాయి. వీటిని భారీ బందోబస్తు మద్య పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేర్చారు.

కంటెయినర్ల వారీగా పోలీసు అధికారుల డ్యూటీ

కంటెయినర్ల వారీగా పోలీసు అధికారుల డ్యూటీ

మత్స్యపురి నుంచి తుందుర్రు వరకూ భారీగా మోహరించారు. ఒక్కో కంటైనర్‌ వెనుకా ఓ డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మొత్తం వంద మంది సిబ్బంది కంటెయినర్ల తరలింపులో నిమగ్నమయ్యారు. వీరుకాక అడుగడుగునా మోహరించేందుకు 800 మంది పోలీసు సిబ్బందిని వినియోగించినట్టు సమాచారం.వీరిని రాజధాని, అమరావతి, కృష్ణాజిల్లా నుంచి రప్పించినట్టు తెలుస్తోంది. వీరవాసరం, మత్స్యపురి మీదుగా ఈ కంటెయినర్లను తరలించారు. కంటెయినర్ల తరలింపు సమయంలో పోలీసులు గ్రామాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. సాధారణ జన జీవనానికి ఆటంకం కలిగించారు. దీంతో పనులపై బయలుదేరిన వారు కూడా వాయిదాలు వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు.

మహిళలు సహా పలువురి అరెస్ట్

మహిళలు సహా పలువురి అరెస్ట్

గురువారం నాటి పరిణామాలకు నిరసనగా శుక్రవారం నరసాపురం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ సెంటర్‌లో ఆందోళన చేసే యత్నం చేశారు. అయితే అక్కడికి సిబ్బందితో కలిసి చేరుకున్న టౌన్‌ ఎస్సై కే చంద్రశేఖర్‌ ఆందోళన విరమించాలని సూచించారు. దీనికి నిరసనకారులు అంగీకరించకపోవడంతో సీపీఎం నాయకుడు మంతెన సీతారం సహా ఆందోళనకారులను పోలీసులు లాక్కెళ్లి జీపులో పడేసి స్టేషన్‌కు తరలించారు. యంత్రాలను ఫ్యాక్టరీలోకి తరలించడానికి పోలీసులు పక్కా వ్యూహంతో పని చేసినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల ముందు నుంచే ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక కమిటీ నాయకులను, ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా అరెస్ట్ చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ముందు జాగ్రత్తగా కీలక నేతల అరెస్టులు ఇలా

ముందు జాగ్రత్తగా కీలక నేతల అరెస్టులు ఇలా

పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న మరికొంత మంది ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో యంత్రాలు తరలించే సమయంలో ఆందోళన జరిగింది. తోపులాటల్లో కొందరు కారం చల్లడం, కిరోసిన్‌ క్యాన్లు తేవడంతో సీన్‌ మారిపోయింది. దీనిని బూతద్దంలో చూపి పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఆందోళనకారులు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని పోలీసులు 353, 307, 143, 149, 108 తదితర బలమైన సెక‌్షన్లతో 14 మంది కీలక నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మరికొంతమందిని చేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఒక రోజు ముందు అదుపులోకి తీసుకున్న వారిపైనా పలు సెక్షన్‌లపై కేసులు నమోదు చేశారు. ఇలా బయట నాయకులు లేకుండా చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేయడం ద్వారా ఫ్యాక్టరీలోకి యంత్రాలను పంపగలిగారు.

మహిళల పట్ల పోలీసుల తీరిది

మహిళల పట్ల పోలీసుల తీరిది

ఇండ్ల మధ్య పెద్ద ఫుడ్ పార్క్ నిర్మాణం సమ్మతమేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దాని సమీపానే గొంతేరు ఎత్తిపోతల పథకం ఉన్నదని గుర్తు చేస్తున్నారు. మెగా అక్వా ఫుడ్ పార్క్‌కు 200 కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ హైస్కూల్ నడుస్తోంది. గత ఫిబ్రవరిలో వందల మంది మహిళలు ఆక్వాఫుడ్ పార్కునకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడూ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి వారిపట్ల నిర్దయగా వ్యవహరించారు. తాజాగా ఆందోళనలో పాల్గొన్న మహిళలను పోలీసులు దుర్భాషలాడుతూ లాఠీలు ఝుళిపించారని విమర్శలు వచ్చాయి.
55 ఏళ్ల అన్నపూర్ణ పొలిచెట్టి అనే మహిళ గర్భవతి అని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహిళలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ఆందోళన నుంచి వైదొలగకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ మహిళలను అరెస్ట్ చేసేందుకు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని నరసాపురం డీఎస్పీ పూర్ణచందర్ రావు పేర్కొన్నారు. తాము ఆందోళనకారులపై దాడులు చేయలేదని సమర్థించుకున్నారు.

English summary
Violence erupted in three villages of Andhra's West Godavari district, as police arrested 12 protesters and detained as many as 60 people, including 26 women.The villages Tundurru, Kamsali Bethapudi and Jonnalagaruvu of Bhimavaram Mandal have been on the boil for several months, demanding that the Godavari Aqua Mega Food Park being established by the Ananda Group of companies, be relocated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X