Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మధ్య తరగతి వారికి అందనంత ఎత్తుకు ఎగబాకిన బంగారం ధరలు

బంగారం ధరలు చేతికి అందట్లేదు. అదొక విలాస వస్తువు అయిపోయింది. సామాన్యులకు కాదు కదా.. ధనవంతులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 1,60,000 రూపాయలకు చేరువ అవుతోందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశీయ డిమాండ్ తో పాటు క్షణక్షణానికి మారుతున్న కరెన్సీ రేట్లు.. బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

కిందటి ముగింపు సెషన్స్ తో పోల్చుకుంటే..

ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ఆల్ టైమ్ హైని తాకింది. రూ. 1,59,226ల వద్ద ట్రేడ్ అయింది. కిందటి ముగింపు సెషన్స్ తో పోల్చుకుంటే ఒక్కపూటలో 11,000 రూపాయల వరకు పెరుగుదల కనిపించింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే వీటి రేట్లు పెరుగుతూ పోయాయి. 1,56,531 రూపాయల వద్ద ట్రేడింగ్ మొదలైంది. తొలిగంటలో కొంత తగ్గుదల నమోదైంది గానీ అది నామమాత్రమే. ఉదయం 10 గంటల సమయానికి 1,57,682 రూపాయల ట్రేడ్ అయింది.

Gold Price in India Edge Higher 24K at Rs 15 949 per gram 22K at Rs 14 620 with global trends

కిలో వెండి ధర..

వెండిదీ ఇదే పరిస్థితి. కిలో వెండి ధర ప్రస్తుతం 3,31,089 రూపాయలుగా నమోదైంది. కిందటి రోజుతో పోల్చుకుంటే దాదాపుగా 3,000 రూపాయలు పెరిగింది. ఈ ఉదయం కిలో వెండి ధర ట్రేడింగ్ 3,25,826 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభం కాగా.. గరిష్ఠంగా 3,39,927 రూపాయలను తాకింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,949, 22 క్యారెట్లు - రూ. 14,620, 18 క్యారెట్లు - రూ. 12,190

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,862, 22 క్యారెట్లు- రూ. 14,540, 18 క్యారెట్లు - రూ. 11,897

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,862, 22 క్యారెట్లు- రూ. 14,540, 18 క్యారెట్లు- రూ. 11,897

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,862, 22 క్యారెట్లు- రూ. 14,540, 18 క్యారెట్లు- రూ. 11,897

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,862, 22 క్యారెట్లు- రూ. 14,540, 18 క్యారెట్లు- రూ. 11,897

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,862, 22 క్యారెట్లు- రూ. 14,540, 18 క్యారెట్లు- రూ. 11,897

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+