2026లో శక్తిమంతమైన అధికమాసం:
2026వ సంవత్సరం ఎన్నో విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఏడాది 12 నెలలకు బదులుగా 13 నెలలు ఉండటం ఒక ప్రధాన ప్రత్యేకత. విక్రమ సంవత్సరం 2083లో అదనపు చాంద్రమాసం జ్యేష్టంలో అధిక మాసంగా ఏర్పడుతుంది. ఈ అరుదైన సందర్భం జ్యేష్ట మాసాన్ని దాదాపు 60 రోజులు పొడిగిస్తుంది. 2026ను 13 నెలల సంవత్సరంగా మారుస్తుంది. చంద్ర, సౌరమాన గణనల మధ్య వ్యత్యాసమే దీనికి కారణం.
ధార్మికంగా ఈ అధిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంస్కృతిలో అధిక మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక శక్తికి నెలవుగా భావిస్తారు. ఈ విశిష్ట కాలంలో సరైన పద్ధతిలో ఆధ్యాత్మిక పూజలు, ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు ఆచరించడం ద్వారా ఊహించని శుభాలు, కోరికలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ అధికమాసంలో చిన్న పొరపాట్లు చేసినా, అవి ఏడాది పొడుగునా కష్టాలను తెస్తాయని నమ్ముతారు. అందుకే వీటిని అధిగమించడానికి పాటించవలసిన కొన్ని పరిష్కారాలను ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తోన్నారు.
2026లో జ్యేష్ట మాసం మే 22న ప్రారంభమై జూన్ 29తో ముగుస్తుంది. ఈ మధ్యలో అధిక మాసం మే 17న ప్రారంభమై జూన్ 15న ముగుస్తుంది. ఒక చాంద్రమాస వ్యవధి క్యాలెండర్లో రెండుసార్లు వచ్చినప్పుడు, దానిని పురుషోత్తమ మాసం లేదా అధిక మాసం అని పిలుస్తారు. చంద్ర, సౌరమాన పద్ధతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమతుల్యం చేయడానికి అధిక మాసాన్ని క్యాలెండర్లో చేరుస్తారు.

సుమారు ప్రతి 32 నెలలకు 16 రోజుల, కొన్ని గంటల అదనపు కాలం చేరడం వల్ల అది ఒక పూర్తి నెలకు సమానమవుతుంది. సనాతన ధర్మంలో ఈ అదనపు కాలాన్ని అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అని వ్యవహరిస్తారు. చంద్రమానం, సౌర సంవత్సరాల వ్యవధి వేరు. చంద్రుడి నెలవారీ చక్రం సూర్యుని చక్రం కంటే కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఏటా సుమారు 11 రోజుల తేడా కనిపిస్తుంది. సుమారు 32 నెలల 16 రోజుల్లో ఈ వ్యత్యాసం ఒక పూర్తి నెలకు సమానమవుతుంది. ఈ అదనపు కాలాన్ని సర్దుబాటు చేయడానికి క్యాలెండర్‌కు ఒక అదనపు మాసం జోడించబడుతుంది. దీనినే అధిక మాసం అని పిలుస్తారు.
శాస్త్రాల ప్రకారం, అధిక మాసంలో నీటిని వృథా చేయడం, పగటి నిద్ర, కోపం, కలహాలు మానుకోవాలి. వంకాయ, వెల్లుల్లి, ఆవాలు, కారపు పదార్థాలు, మాంసాహారం, మద్యం సేవించడం పూర్తి నిషిద్ధం. పెళ్లి వయసు పిల్లల వివాహాలు, కొత్త గృహాల నిర్మాణం వంటి శుభకార్యాలను కూడా ఈ మాసంలో ప్రారంభించకూడదు. ఈ అధిక మాసం ఆత్మనిగ్రహం, దానధర్మాలు, స్వీయ శుద్ధీకరణకు ఉద్దేశించినది.
అధిక మాసంలో శరీరానికి అధిక వేడి తగలకుండా చూసుకోవాలని, అలాగే వాత దోషాలను నివారించాలని కూడా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అధిక మాసంలో నీటిని దానం చేయడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, జంతువులు, పక్షులకు నీటిని అందించడం వంటి పుణ్యకార్యాలు అత్యంత శుభప్రదం. తులసిని, సూర్య భగవానుడిని పూజించడం వలన కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. నిర్జల ఏకాదశి, గంగా దశమి, వట సావిత్రి వంటి ఉపవాసాలను పాటించడం చాలా శుభకరంగా పరిగణించబడుతుంది.
ఈ నెలలో రోజుకు ఒకసారి భోజనం చేయడం, నువ్వులను దానం చేయడం ద్వారా అధిక పుణ్యం లభిస్తుంది. ఇలాంటి ధార్మిక కార్యాల ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చని, తద్వారా జీవితంలో శాంతి, ఆనందం చేకూరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications