జయ మృతి చెంది నెల రోజులు అయ్యింది: అందరూ ఇలా
జయలలిత చనిపోయి నెల రోజులు పూర్తి అయిన సందర్బంగా తమిళనాడు ప్రజలు అమ్మ ఫోటోలతో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా, తమిళ ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన జయలలిత మరణించి నేటికి నెల రోజులు అయ్యింది. అమ్మ చనిపోయి నెల రోజులు పూర్తి అయిన సందర్బంగా తమిళనాడు ప్రజలు అమ్మ ఫోటోలతో ర్యాలీలు నిర్వహించారు.
అన్నాడీఎంకే కార్యకర్తల ఆధ్వర్యంలో తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. జయలలిత ఫోటోలు పెట్టుకుని, నల్లబ్యాడ్జీలు వేసుకుని ర్యాలీలు నిర్వహించారు.

అనేక ప్రాంతాల్లో జయలలిత పేరు మీద ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించారు. జయలలిత ఆశయాలు నేరవేర్చుతామని అన్నాడీఎంకే నాయకులు ప్రతిజ్ఞ చేశారు. పలు చోట్ల అమ్మ అభిమానులు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశారు.
చెన్నైలోని మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అమ్మకు నివాళులు అర్పించారు. జయలలిత మరణించి నెల రోజులు అయినా ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications