మోగ్లీ 2.0 : కోతులతో కలిసి ఉంటూ.. కోతిలా మారిపోయిన బాలిక
మోగ్లీ 2.0 : కోతులతో కలిసి ఉంటూ.. కోతిలా మారిపోయిన బాలిక
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ బాలిక(8) కొన్నాళ్లుగా కోతులతో కలిసి ఉంటూ కోతిలా మారిపోయింది. ఇప్పుడు అచ్చం కోతిలాగే తింటోంది.. కోతిలాగే ప్రవర్తిస్తోంది. మనుషులను చూస్తే భయపడుతోంది. పోలీసులు ఎంతో శ్రమించి ఆ బాలికను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడి కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని శాంక్చురీలోని మోతిపూర్ రేంజ్ లో ఎస్సై సురేశ్ యాదవ్ రెండు నెలల క్రితం పెట్రోలింగ్ చేస్తుండగా ఈ బాలిక ఆయన కంట పడింది. ఓ కోతుల గుంపులో ఈ బాలిక ఉంది.

ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. కోతులతోపాటు ఆ బాలిక కూడా అరవడం మొదలుపెట్టింది. దీంతో అతికష్టం మీద ఆ బాలికను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడడం లేదు. ఏ భాషనూ అర్థం చేసుకోవడం లేదు.
మనుషులు దగ్గరికొస్తే భయపడుతోంది. అప్పడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ.. దగ్గరికి వెళితే దాడి చేస్తోందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. చికిత్స తరువాత కొంత మేర కోలుకున్నట్లు కనిపిస్తోందని, నిదానంగా ఆమెలో మార్పు వస్తోందని వారు పేర్కొంటున్నారు.
ఇంతకుముందు ఏదైనా పెడితే కోతిలాగే తినేదని, ఇప్పుడు ఆహారాన్ని నేరుగా నోటి ద్వారా తీసుకుంటుందని, కాళ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ బాలిక ఇప్పటికీ జంతువుల మాదిరిగా కాళ్లు చేతులు ఉపయోగించి నడుస్తోందని వారు వివరించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications