బడ్జెట్ ముహూర్తం ఫిక్స్: పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఇదే!
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జనవరి 28వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అంత కంటే ఒక రోజు ముందు.. అంటే జనవరి 27న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఉభయ సభలు సజావుగా సాగడం, చేపట్టాల్సిన కీలక బిల్లులు, ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించనుంది.
బడ్జెట్ షెడ్యూల్ ఇలా..
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బడ్జెట్ సమావేశాల వివరాలను వెల్లడించారు. జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.జనవరి 31న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, సంప్రదాయం ప్రకారం నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

రెండు విడతల్లో సమావేశాలు
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతుంది. రెండో విడత మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. మధ్యలో ఉన్న విరామ సమయంలో పార్లమెంటరీ స్థాయి సంఘాలు వివిధ శాఖల కేటాయింపులపై లోతైన అధ్యయనం చేస్తాయి.
మోదీ ప్రభుత్వం ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటుంది: కిరణ్ రిజిజు
మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆలోచనాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తున్నాం" అని ధీమా వ్యక్తం చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications