వోడాఫోన్ బంపర్ఆఫర్: 9 జీబీ 4 జీబీ ఉచిత డేటా 3 నెలల పాటు ఉచితం
రిలయన్స్ జియో దెబ్బకు మేజర్ టెలికం కంపెనీలు ఆఫర్లతో కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ నెలకు 9 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకు మేజర్ టెలికం కంపెనీలు ఆఫర్లతో కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ నెలకు 9 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది.
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి రావడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అన్ని టెలికం కంపెనీలు కొత్త ఆఫర్లతో కస్టమర్ల వద్దకు వస్తున్నాయి.
రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు రావడంతో ప్రత్యర్థి కంపెనీలు కూడ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రిలయన్స్ జియో కంటే మెరుగైన ఆఫర్లను ప్రకటిస్తేనే కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని ఇతర టెలికం కంపెనీలు భావిస్తున్నాయి.మరో వైపు తమ కస్టమర్లు రిలయన్స్ జియో వైపుకు వెళ్ళకుండా ఉండేందుకుగాను ఆఫర్లమీద ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.

9జీబీ డేటా ఆఫర్ ను ప్రకటించిన వోడాఫోన్
రిలయన్స్ జియో దెబ్బకు వోడాఫోన్ దిగివచ్చింది.వోడాఫోన్ నెట్ వర్క్ కు చెందిన పోస్ట్ పెయిడ్ యూజర్లకు నెలకు 9 జీబీ డేటా చొప్పున మూడుమాసాలకు 27 జీబీ 4 జీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.ఈ ఆఫర్ కు ప్రత్యేకంగా ఛార్జీల వసూలు చేయబోనని వోడాఫోన్ ప్రకటించింది.ఈ మేరకు వోడాపాన్ తన అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.

రెండు కొత్త ఆఫర్లను ప్రకటించిన వోడాఫోన్
అమెజింగ్ ఆఫర్స్ పేరుతో రెండు ఆఫర్లను వోడాఫాన్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఆఫర్ పొందాలంటే ఈ నెట్ వర్క్ లో పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకొని ఉండాలి. 4 జీ హ్యాండ్ సెట్ వాడుతూ ఉండాల్సిందే. నెలకు కనీసం 1 జీబీ డేటాను ఇప్పటికే వాడుతుండాలి. దీనికి గాను వోడాఫోన్ రెడ్ కు చెందిన రూ.499 లేదా రూ.699 ప్లాన్ ను కస్టమర్లు (రెడ్ ఫ్యామిలీ) అయినవారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు.

12 నెలలపాటు 3 జీబీ అదనపు డేటా
రెడ్ ప్లాన్ లో ఉన్నవారికి 12 మాసాలపాటు 3 జీబీ అదనపు డేటాను అందించనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది. రెడ్ అన్ లిమిటెడ్ ప్లాన్ లో ఉన్నవారికే ఈ సదుపాయం అందించనుంది. అందుకుగాను యూజర్లు వోడాఫోన్ సైట్ లో తమ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఆ తర్వాత వచ్చే ఓటిపిని కన్ పాం చేసుకోవాల్సి ఉంటుంది.దీంతో ఫ్రీ 4 జీ డేటాను క్లైయిం చేసుకోవచ్చు.

ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త ఫ్లాన్
ప్రీపెయిడ్ యూజర్లకు కూడ వొడాఫోన్ కోత్త ప్లాన్ ను ప్రకటించింది. 4 జీ ఫోన్ ఉన్నవారు, రూ.352 లతో రీఛార్జీ చేసుకొంటే వారికి 28 రోజులపాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తోంది. రిలయన్స్ జియో ఆఫర్ల కారణంగా వొడాఫోన్ ఈ ఆఫర్లను ప్రకటించింది.పోటీని తట్టుకొనేందుకుగాను టెలికం కంపెనీలన్నీ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications