కాంగ్రెస్ ప్రయత్నాలకు ఆదిలోనే దెబ్బ, విపక్షాలన్నీ కలిసి పనిచేసేనా,దూరమైనా సిపిఎం
పెద్ద నగదు నోట్ల రద్దు తో పాటు ఇతర అంశాలను చర్చించేందుకుగాను విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే దెబ్బపడింది.డిసెంబర్ 27వ, తేదిన నిర్వహించే సమావేశానికి తాము ద
న్యూఢిల్లీ :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు ఆదిలోనే దెబ్బపడింది ఈ సమావేశానికి తాము హజరుకావడం లేదని సిపిఎం ప్రకటించింది. పార్లమెంట్ లో విపక్షాలు పెద్ద నగదు నోట్ల రద్దు అంశంతో కొంత మేరకు ఇబ్బంది పెట్టాయి.
పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణ నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కొంత సక్సెస్ అయినట్టు కన్పించింది.
పార్లమెంట్ సమావేశాల్లో అధికార పార్టీని విపక్షాలు పెద్ద నగదు నోట్ల రద్దుపై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్ సమావేశాలు స్ధంభింపజేశాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో కూడ ఇదే వైఖరిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలో విపక్షపార్టీలకు చెందిన ఎంపిలు రాష్ట్రపతిని కలిశారు. అంతవరకు బాగానే ఉంది కాని, పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజుల్లో రాష్ట్రపతిని మరోసారి కలవాలని నిర్ణయం తీసుకొన్నారు. కాని, చివరకు ఈ సమావేశంలో కొన్ని పార్టీలు కలిసిరాలేదు.

కాంగ్రెస్ సమావేశానికి సిపిఎం దూరం
పెద్ద నగదు నోట్ల రద్దుతో పాటు ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో తర్వాత భవిష్యత్తులో నిర్వహించాల్సిన పోరాటాలపై విపక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావాలపి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు విపక్షాలతో కలిసి కార్యాచరణను సిద్దం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విపక్ష పార్టీలను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆహ్వనం పలికింది. అయితే ఈ సమావేశానికి తాము హజరుకాబోమని సిపిఎం తేల్చిచెప్పింది. ఈ సమావేశానికి మమత బెనర్జీ ఈ సమావేశానికి హజరైతే తాము హాజరుకాబోమని ప్రకటించారు

కాంగ్రెస్ తీరుపై విపక్షాల అసంతృప్తి
ఓక అంశంపై ప్రభుుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు వ్యూహాలను రచించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ప్రధానమంత్రిని , రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం ఒంటరిగా కలవడంపై కూడ విపక్షాలకు చెందిన పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ అనుసరించే వైఖరి సక్రమంగా లేదనే అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి.

రాజకీయ ఎజెండాలను వదిలి కలిసేది అనుమానమే
ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలను కల్గించే అంశాలను నష్టపర్చే విధంగా ఇతర పార్టీలతో జత కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే విపక్షపార్టీలతో కలిసి నిర్వహించే కార్యక్రమాల్లో మమత బెనర్జీ పాల్గొంటే సిపిఎం దూరంగా ఉండనుంది. సిపిఎం పాల్గొంటే మమత బెనర్జీ దూరంగా ఉండాలని భావిస్తోంది. అయితే రాజకీయంగా నష్టం కల్గించే వ్యవహరాలకు అన్ని పార్టీలు దూరంగా ఉండనున్నాయి.డిఎంకె కలిసివస్తే, అన్నా డిఎంకె దూరంగా ఉండే అవకాశం ఉంది. జెడి యూ బిజెపికి వ్యతిరేక వైఖరితోనే ఉంది. అయితే పెద్ద నగదు నోట్ల రద్దును ఆ పార్టీ మాత్రం స్వాగతించింది. సమాజ్ వాదీ పార్టీ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ప్రధాని లక్ష్యంగా రాహూల్ విమర్శలు
వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాందీ విమర్శలు గుప్పిస్తున్నారు. సహరా గ్రూప్ నుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోడీ 40 కోట్లను తీసుకొన్నాడని ఆయన ఆరోపించారు.. సహరా గ్రూప్ నుండి ఎవరెవరు ఎంతెంత తీసుకొన్నారనే విషయమై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ విషయాలను లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని చేయాలని భావిస్తోంది.అయితే విపక్షాలను కూడగట్టుకొని పోవడం వల్ల బిజెపి పై మరింత ఒత్తిడి తసుకురావచ్చనే అభిప్రాయంతో ఉంది.అయితే విపక్షాలు ఏ మేరకు కాంగ్రెస్ తో పూర్తిగా సహకరిస్తాయో అనేది వేచి చూడాల్సిందే.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications