అమెరికాను కెలికిన మోడీ..! ప్రతీకారానికి సిద్ధమవుతున్న ట్రంప్..!
అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారత్ తో సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో వలసల బహిష్కరణ, వీసాల కోత సహా చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారన్న కారణంతో 50 శాతం సుంకాల మోతను కూడా భారత్ భరించాల్సి వస్తోంది. తాజాగా దీనిపై ప్రతీకారంగా మోడీ అమెరికా ఉత్పత్తులపై పన్ను విధించారు. దీంతో ట్రంప్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
గతేడాది రష్యాను చమురు కొనుగోళ్లు చేస్తున్నారనే కారణంతో ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకునే పరిస్ధితి లేదని అంతా భావించారు. కానీ ప్రధాని మోడీ సైలెంట్ గా గత నవంబర్ లో అమెరికా పప్పులపై 30 శాతం సుంకం విధించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం బయటపెట్టలేదు. కానీ అమెరికాలో ఇద్దరు సెనేటర్లు తాజాగా ఈ విషయాన్ని ట్రంప్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. దీంతో ట్రంప్ ఇప్పుడు భారత్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించినందుకు ప్రతీకారంగా మోడీ సర్కార్ 30 శాతం సుంకాలు విధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా.. ఇప్పుడు ఇరుదేశాల మధ్య చర్చల దశలో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. గత కొంతకాలంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. దీని వెనుక అమెరికా పప్పులపై భారత్ విధించిన సుంకం కూడా ఓ కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

ఇప్పుడు సెనేటర్ల ఫిర్యాదుతో ట్రంప్ అధికారికంగానే ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్రంప్ కు రాసిన లేఖలో రిపబ్లికన్ సెనేటర్లు స్టీవ్ డైన్స్ (మోంటానా), కెవిన్ క్రామెర్ (నార్త్ డకోటా) పప్పుధాన్యాల పంటలను ఉత్పత్తి చేసే మొదటి రెండు రాష్ట్రాలు తమవని, బఠానీలు సహా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు అని, ప్రపంచ వినియోగంలో దాదాపు 27 శాతం వాటా కలిగి ఉందని పేర్కొన్నారు. కాయధాన్యాలు, శనగలు, ఎండిన బీన్స్ , బఠానీలు భారత్ లో ఎక్కువగా వాడే పప్పుధాన్యాల పంటలలో ఉన్నాయి. ఇప్పుడు వీటిపైనే భారత్ సుంకాలు విధించింది.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications