Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతి అనుమానాస్పద మృతి, జననాంగంతో పాటు శరీరంపై గాయాలు

డిగ్రీ పరీక్షలు బాగా రాశానని సంతోషంతో ఇంటికి వెళ్ళిన ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మరణించింది. యువతి జననాంగంపై, గొంతు, నడుము, వీపుపై గాయాలున్నాయి. దీంతో మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

సిద్దిపేట:డిగ్రీ పరీక్షలు బాగా రాశానని సంతోషంతో ఇంటికి వెళ్ళిన ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మరణించింది. యువతి జననాంగంపై, గొంతు, నడుము, వీపుపై గాయాలున్నాయి. దీంతో మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న సంతోషి మంగళవారం నాడు వార్షిక పరీక్షలకు హజరైంది. పరీక్షలు బాగా రాశానని చాలా ఉత్సాహంగా చెప్పిన మరుసటిరోజే ఆమె చనిపోయిందని తెలవడంతో బంధువులు, స్నేహితులు దిగ్ర్బాంతి చెందారు.సంతోషిని చంపేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన సంతోషిని ఆమె అక్క రేణుకను తొమ్మిదేళ్ళ క్రితం గుమ్మన్నగారి పద్మావతి, రవిశంకర్ వర్మ దంపతులు తాము పోషిస్తామని తీసుకొన్నారు.వీరిద్దరూ కూడ ప్రభుత్వ ఉపాధ్యాయులే.

A degree student dead in Siddipeta district

ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు పౌరోహిత్యం చేస్తున్నాడు. చిన్న కొడుకు శరత్ చంద్ర సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరు గతంలో సంతోషిని చితకబాదిన ఆరోపణలున్నాయి. సంతోషిపై శరత్ చంద్ర అత్యాచారం చేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె జననాంగం వద్ద, గొంతు, నడుము , వీపుపై గాయాలైనట్టు బంధువులు గుర్తించారు.ఒంటిపై కొరికిన గాట్లు, కాల్చిన గాయాలున్నట్టు బంధవులు తెలిపారు. తన సోదరిని విగతజీవిగా చూసిన రేణుకు స్పృహ కోల్పోయింది. ఆమె నర్సింగ్ కోర్సు చదువుతోంది.

తమ ఇంట్లోనే సంతోషి చనిపోయిన విషయమై తమపై నిందలు పడకుండా ఉపాధ్యాయులు పద్మావతి, రవిశంకర్ కుమార్ కుమారులు అప్రమత్తమయ్యారనే ఆరోపణలున్నాయి. అర్ధరాత్రే సంతోషి చనిపోగా సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

బుధవారం ఉదయం సంతోషి బంధువులకు ఫోన చేసి వాంతులు, విరేచనాలు చేసుకొంటోందని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి చనిపోయిందని మళ్ళీ ఫోన్ చేశారు. సంతోషి మృతదేహాన్ని అంబులెన్స్ లో సిర్సనగండ్లకు తీసుకెళ్ళి వారి బంధువులకు అప్పగించారు.

సంతోషి ఒంటిపై ఉన్న గాయాలను చూసి అనుమానం వచ్చిన బంధువులు మృతదేహాన్ని సిద్దిపేటకు తీసుకొచ్చి ఆందోళన చేశారు. సంతోషి బట్టలు, పుస్తకాలు, బిందె, స్టౌ అన్నీ బాత్రూమ్ లోనే ఉన్నాయి. ఆమె బాత్రూమ్ లోనే బసచేసేలా నిబంధనలు విధించినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. వాళ్ళ చిన్న కొడుకు శరత్ చంద్ర ఆమెపై రెండు, మూడు సార్లు అత్యాచారయత్నం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

అనాధను చేరదీసి పెంచి పెద్దచేసిన తాము ఎందుకు చంపుతామని ఉపాధ్యాయురాలు పద్మావతి దంపతులు ఖండిస్తున్నారు. ఎండవేడికి అస్వస్థకు గురై కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతోనే మంగళవారం నాడు ఆసుపత్రికి తీసుకెళ్ళామని వైద్య పరీక్షలు చేసి ఈసీజీ కూడ తీయించామన్నారు. చికిత్స చేస్తుండగా నోట్లో నుండి రక్తం వచ్చిందన్నారు. ఫిట్స్ తో చనిపోయిందని వైద్యులు చెప్పారని పద్మావతి దంపతులు చెప్పారు.

సంతోషి మృతిపై బంధువులు, స్నేహితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయలేమని సిద్దిపేట ఏసీపీ నర్సింహ్మరెడ్డి చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+