Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాంగ్ రేప్ అసలు గుట్టు ఇది: శారీరకంగా లోబరుచుకుని, స్నేహితులకు అప్పగించి....

ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే వాస్తవం బయటపడింది. ప్రేమ పేరుతో బాలికను శారీకంగా లోబరుచుకుని, పెళ్లికి ఒత్తిడి తేవడంతో వదిలించుకోవడానికి నిందితుడు నీచమైన స్థితికి దిగజారినట్లు తేలింది.

ఖమ్మం: ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే వాస్తవం బయటపడింది. ప్రేమ పేరుతో బాలికను శారీకంగా లోబరుచుకుని, పెళ్లికి ఒత్తిడి తేవడంతో వదిలించుకోవడానికి నిందితుడు నీచమైన స్థితికి దిగజారినట్లు తేలింది. ప్రధాన నిందితుడు అఖిల్ తిరుపతికి పరారైనట్లు పోలీసులు కనిపెట్టారు.

దాంతో అఖిల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఒక ప్రత్యే క బృందాన్ని అక్కడికి పంపించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అతడు సహవిద్యార్థినిని ప్రేమ పేరుతో శారీరకంగా లోబరచుకున్నాడని, ఆమె పెళ్లి చేసుకోవాలని అడగడంతో తప్పించుకునేందుకు నీచమైన నాటకానికి తేర తీశాడని తెలుస్తోంది.

ఆమెను స్నేహితులకు అప్పగించి, వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ వీడియోలు అతడివద్దే ఉన్నట్టు సమాచారం. బుధవారం అతడిని అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అతడిని తీసుకొచ్చిన తర్వాత నలుగురినీ పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారు.

తల్లి ఆస్పత్రిలో పనిచేస్తూ....

తల్లి ఆస్పత్రిలో పనిచేస్తూ....

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులవీ సామాన్య కుటుంబాలేనని సమాచాం. వారి తల్లిదండ్రులు వారిని కూలీపనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసి కష్టపడి చదివిస్తున్నారు. ఖమ్మం నగరంలోని బస్‌డిపో రోడ్‌కు చెందిన అఖిల్‌ తండ్రి చనిపోగా, తల్లి ఓ ఆస్పతిల్రో పని చేస్తూ కొడుకును చదివిస్తున్నారు.

తండ్రి వ్యవసాయం చేస్తూ..

తండ్రి వ్యవసాయం చేస్తూ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి చెందిన రాధాకృష్ణ తండ్రి వ్యవసాయం చేస్తూ కొడుకును ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివిస్తున్నారు. మరో నిందితుడు ఉదయ్‌ది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కెప్టెన్‌ బంజర గ్రామం. అతడి తల్లిదండ్రులు కూలి పని చేస్తూ కొడుకును ఖమ్మంలో ఉంచి చదివిస్తున్నారు. మరో నిందితుడు కార్తీక్‌ది ఖమ్మం రూరల్‌ మండలంలోని జలగంనగర్‌. తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా తల్లి కూలి పని చేస్తోంది. తల్లిదండ్రులు అలా కష్టపడి చదివిస్తుంటే పిల్లలు ఇలా దారి తప్పి వ్యవహరించారు.

ఇలా ఆందోళన...

ఇలా ఆందోళన...

ప్రేమోన్మాదం నశించాలని, ప్రేమపేరుతో విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు మంగళవారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఎస్‌ఎఫ్ఐ, టీఎన్‌ఎస్ఎఫ్, పీడీఎస్‌యు, ఏఐఎస్ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐద్వా, ఎన్‌డబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు మహిళా డిగ్రీ కళాశాల నుంచి ఆర్జేసీ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహించారు.

డిమాండ్లు ఇవీ....

డిమాండ్లు ఇవీ....

సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ), పీవైఎల్‌, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రేమోన్మాది దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టుకుంటూ ఖమ్మం వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+