సత్తి.. బిత్తిరి సత్తి.. : ఎందుకింత పాపులారిటీ?
సీరియళ్లన్నీ రయ్యిమని దూసుకుపోతున్న ట్రాఫిక్ అది..
మరోపక్క బుల్లితెర బుల్లెట్ 'జబర్దస్త్'
ఒకటీ.. రెండూ..
సత్తి రెండడుగులు ఎన్కకేసి.. 'సూస్కుందమిక' అని రెండింటి నడుమ దుంకిండు.
ఖైరతాబాద్ సర్కిళ్లనన్న టక్కర కాదేమో గనీ, ఈ టెలివిజన్ ట్రాఫిక్ లో టక్కర కాకుండా తమకంటూ ఓ
స్పేస్ క్రియేట్ చేసుకోవడం.. అయ్యా..! అంత వీజీ అయితే కాదు.
ఓకె.. అనుకున్నట్లే.. సేఫ్ ల్యాండింగ్ జరిగింది.
తర్వాత..!!
ఉన్నకాన్నే ఉంటే పని కల్వదు..
రోడ్డు మీద గ్రీన్ లైట్ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసినట్లు
సత్తి 'షో' ఛానెల్ ముందు ట్రాఫిక్ క్రియేట్ చెయ్యాలె..

అందుకే.. 'ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా
రాత్రి తొమ్మిదిన్నరయిందంటే టీవీ రిమోట్ మీద పోటీ పడేది నువ్వా..? నేనా..?' అన్న అనివార్యత నడుమ.. సత్తి మళ్లో డైలాగ్ కొట్టిండు 'ఎవ్వనికీ భయపడేది లేదు.. ఛలో సూస్కునుడే ఇగ'
అయితే.. సత్తికిదో సవాల్.. టెలివిజన్ వాల్ మీద.. ఖర్చీఫ్ పరుచుడు కాదు, ఏకంగా.. ఓ లొడాసు అంగీనే పర్చి జాగా పోనియ్యకుండా చూడాలె.
కండీషన్స్ కూడా అప్లయి అవుతయ్..
ఎట్లంటే..! సత్తికో బౌండరీ ఉంది.. అందులో సేఫ్ గేమ్ మాత్రమే ఆడాలన్న రూల్ ఉంది.. భారీ హిట్టింగులు చేయొద్దు.. కానీ వేసే జోకు మాత్రం బౌండరీ అవుతల పేలాలే.
దానికోసం.. సత్తి చేతిల ఓ అస్త్రం తెచ్చి పెట్టింది వీ6 ఛానెల్.. అదే ఇప్పుడు తెలంగాణ అంతటా మారుమోగుతోన్న 'బిత్తిరి'
ఇగ ఆ తర్వాత పరిస్థితి ఎట్లయిందంటే..
'సత్తి కేసీఆర్ ను అనుకరించినా.. రేవంతం సారు నమస్తే అన్నా.. చంద్రాలు సారు గాలిమోటర్ల తిరుగుతుండన్నా..! 'సెల్ఫీష్' ఫోటోలను క్రేజీగా ఫీలవుతూ పోరగాండ్లు చేస్తున్న బిత్తిరి పనులకు.. తన బిత్తిరితోని చురకలు పెట్టినా.. 'అవు.. బరాబర్ గిది మా అయ్య జాగీరే' అని తొడ మీద కాదు, పాదం మీద కొట్టుకున్నా.. సాఫిత్రీ అంటూ సాగదీసినా.. తెలంగాణ అంతా పడీ పడీ నవ్వింది. ఇంకా నవ్వుతంది'.
రాత్రి తొమ్మిదయిందంటే.. తెలంగాణ టెలివిజన్ ట్రాఫిక్ అంతా తీన్మార్ ముందు మోకరిల్లుతందంటే అతియోశక్తి కాదేమో.! ఎందుకూ.. టీవీ ముందు ఎంత బిగదీసుకుని కూర్చున్న మనిషి అయినా సరే.. సత్తి జోకులకు పడీ.. పడీ.. నవ్వాల్సిందే. అద్గదీ సత్తి అంటే.
ఇదంతా కాదు గానీ సత్తీ.. నిక్కచ్చిగా ఒక్క మాటబ్బా..
రాత్రి తొమ్మిదిన్నయిందంటే..!
తెలంగాణంతా నీకోసం ఎదురుచూత్తంది
సిగ్గిడిసిన సినిమా జోకుల నుంచి.. అదే నీ మాటలల్ల చెప్పాల్నంటే.. ఆ 'మురికి జోకుల' నుంచి తెలంగాణ ఇప్పుడు నీతోని సేదతీరుతాంది.
పేరుకే బిత్తిరి సత్తి గానీ.. తెలంగాణ జనమంతా.. నిన్ను మా సక్కదనాలోడని.. మెచ్చుకోని మెడలేసుకున్నరనుకోరాదు!
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications