విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు

దక్షిణాది రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో 2026 సమరం అప్పుడే మొదలైపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తాజాగా 'అగ్ని న్యూస్ సర్వీస్' (ANS) విడుదల చేసిన ఒపీనియన్ పోల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి మరోసారి క్లీన్ స్వీప్ చేయబోతోందని, విపక్షాలకు అందనంత ఎత్తులో మెజారిటీ సాధిస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

చెన్నై ప్రెస్ క్లబ్‌లో ఏఎన్ఎస్ సీఈవో ఆర్. సురేష్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డీఎంకే కూటమి ఏకంగా 180కి పైగా నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేయనుంది అని వెల్లడించారు. దక్షిణ తమిళనాడులో 42 స్థానాల్లో డీఎంకే తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించనుందని పేర్కొన్నారు. పశ్చిమ బెల్ట్ (కొంగు నాడు) ప్రాంతంలో సాధారణంగా అన్నాడీఎంకేకు కంచుకోటగా భావించే ఈ ప్రాంతంలో కూడా ఈసారి డీఎంకే 32 స్థానాలను కైవసం చేసుకోబోతుండటం విశేషం.

DMK Set to Retain Power in 2026 ANS Survey Predicts 180 Seats for Stalin Govt Amid Women Voter Support

మహిళా ఓటర్లే DMK శ్రీరామరక్ష!

ఈ సర్వేలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. డీఎంకేకు లభించిన భారీ మద్దతు వెనుక 'మహిళా శక్తి' ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పుధుమై పెన్', 'విడియల్ పయనం' (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) వంటి పథకాలు గ్రౌండ్ లెవల్‌లో అద్భుతంగా పనిచేశాయి. ఫలితంగా సుమారు 60 శాతం మంది మహిళా ఓటర్లు స్టాలిన్ సర్కార్‌కే జై కొడుతున్నారని సర్వే స్పష్టం చేసింది.

విజయ్ 'TVK' ప్రభావం ఎంత?

సినిమా స్టార్ విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సర్వే ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. చెన్నై వంటి నగరాల్లో అన్నాడీఎంకేను టీవీకే వెనక్కి నెట్టే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విజయ్ పార్టీ ఓట్ల వాటా 10 శాతం కంటే తక్కువకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. అలాగే సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) 8-9% ఓట్లతో తన ఉనికిని చాటుకోనుంది.

చతికిలపడ్డ విపక్షాలు.. బీజేపీకి నిరాశే!

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కేవలం 54 నియోజకవర్గాలకే పరిమితం కావచ్చని సర్వే బాంబు పేల్చింది. ఇక అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఓట్ల శాతం ఏమాత్రం ఆశాజనకంగా లేదని తేలింది. డీఎంకే వ్యతిరేక ఓట్లు విడిపోవడం కూడా అధికార పార్టీకి వరంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి 2026లో తమిళనాడు పీఠంపై మళ్లీ డీఎంకే జెండానే ఎగరనుందని అగ్ని న్యూస్ సర్వే కుండబద్దలు కొట్టింది. మరి ఈ రెండేళ్లలో విపక్షాలు పుంజుకుంటాయా? లేదా 'దళపతి' విజయ్ మ్యాజిక్ ఏమైనా పనిచేస్తుందా? అన్నది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+