"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. నన్ను పాస్ చేయండి సార్.. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్" ఇవి ఓ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ లో రాసిన మాటలు.. తెలంగాణలో ఇటీవల ఇంటర్ పరీక్షలు పూర్తయిన క్రమంలో ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు రూ. లక్షలు ఖర్చు చేస్తున్నారు. పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్పించి మంచి విద్యను అందించేందుకు శ్రమిస్తున్నారు. కానీ కొందరు విద్యార్థులు మాత్రం సోషల్ మీడియా, రీల్స్ పిచ్చిలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తీరా పరీక్షల సమయంలో ఇలాంటి లేఖలను రాస్తూ పేపర్ దిద్దే వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఓ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పటి వరకూ కొందరు విద్యార్థులు.. తమను పాస్ చేయమని బతిమాలుకోవడం, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టడం చూశాం. కానీ తెలంగాణలో ఓ ఇంటర్ విద్యార్థి.. తనను పాస్ చేయాలని ఆన్సర్ షీట్ లో ఏకంగా బొమ్మలు గీసి వేడుకున్నాడు. అయితే ఈ ఆన్సర్ షీట్ ను పేపర్ దిద్దే ఓ ఎగ్జామినర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్ అయింది.
నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న..
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
నన్ను పాస్ చేయండి సార్
నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్
ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్ pic.twitter.com/kokhSgiw3V
ఈ ఆన్సర్ షీట్ లో ఆ విద్యార్థి.. 'సార్.. మీ కాళ్లు మొక్కుతాను.. నన్ను పాస్ చేయండి' అని వేడుకున్నట్లుగా బొమ్మ గీశాడు. అంతటితో ఆగకుండా.. ఓ గురువు కాళ్లపై శిష్యుడు పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ గీశాడు. ఆ గురువు కింద 'సార్' అని, శిష్యుడి కింద 'నేను' అని రాసి ఆ విద్యార్థి తన టాలెంట్ ను చూపించాడు. అయితే ఈ లేఖపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతకు తెగించార్రా.. అని.. నీకు అర్థం అవుతుందా.. అని కామెంట్స్ పెడుతున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications