టీ20 మ్యాచ్ లకు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం - ప్రపంచ కప్ వేళ కొత్త కష్టాలు..!!
Ind Vs NZ: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగలింది. టీంలోని కీలక సభ్యులు ఒకరి తరువాత మరొకరు గాయాల బారిన పడుతున్నారు. న్యూజీలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ తో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచారు. ఈ నెల 18న సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత 5 టీ20 మ్యాచ్ లు షెడ్యూల్ అయ్యాయి. అయితే, టీ20 మ్యాచ్ లకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. దీంతో, ప్రపంచ కప్ ముందు టీమిండియాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.
కివీస్ తో 5 టీ20 మ్యాచ్ లు.. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్ కు టీమిండియా సిద్దం అవుతున్న వేళ భారీ షాక్ తగిలింది. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. రానున్న టీ20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.

కాగా ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్ టీ0 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. కివీస్ తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ సమయంలో సుందర్పక్కటముకల కండరాలకు గాయం అయింది. ఆ మ్యాచులో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన వాషీ.. తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. తాజాగా వచ్చిన స్కానింగ్ రిపోర్ట్‌ల ప్రకారం గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రానున్న టీ20 సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ పేర్కొంది.
కాగా, టీ20 ప్రపంచ కప్ 2026 కోసం టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. సుందర్ దూరం కావటం జట్టు కూర్పుపై ప్రభావం పడనుంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడి.. వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మకు సర్జరీ అవ్వడంతో సమస్యలు మొదలయ్యాయి. సుందర్ దూరమవ్వడం జట్టు సమీకరణాలను దెబ్బ తీస్తుంది. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకునే సుందర్ లేకపోవడం నష్టంగానే భావిస్తున్నారు.
సుందర్ స్థానంలో బదానీ ని ఎంపిక చేయటం పైన విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కప్ ముందు టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. టీ20 ప్రపంచ కప్ సమయానికి గాయాల పాలైన వారిలో ఎవరు కోలుకుంటారు.. టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications