వైఎస్ పథకాలను ఎంత ఖర్చైనా కొనసాగిస్తాం: సిఎం కిరణ్

ప్రత్యే ప్యాకేజీలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. జిల్లాలో సాగునీటి పరిస్థితులు అనుకూలంగా లేవని అయితే నివారణకు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. రైతులకు రుణమాఫీ, ఇందిర క్రాంతి పథకం కింద మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. ఎన్నికలకు ముందు వైఎస్ రైతులకు 12వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.
రాష్ట్రంలో అధికశాతం వ్యవసాయంపై ఆధారపడి ఉండేవాళ్లమని, అన్ని ప్రాంతాలు సమానమేనని ఆయన చెప్పారు. ఇన్నాళ్లు బోర్లతో, బావుల సహాయంతో వ్యవసాయం చేసుకుంటూ వచ్చామని అయితే ఇప్పుడు నీళ్ల సదుపాయానికి ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. దీనికోసం వేలకోట్ల రూపాయలు అవుతున్నాయి. రాజశేఖరరెడ్డి, సోనియా నాయకత్వంలోని పథకాలు ఎంత ఖర్చైనా ముందుకు సాగిస్తాం. దురదృష్టావశాత్తు టిడిపి హయాంలో వానలు తక్కువయ్యాయి. ముసలివారికి, వితంతువులకు పెన్షన్లను పెంచామన్నారు. ఇంతకుముందు 18 లక్షలమందికి పెన్షన్లు ఇచ్చేవారని ఇప్పుడు 72 లక్షల మందికి ఇస్తున్నారన్నారు. ఐకెపి కింద మహిళా గ్రూపులను విస్తృతం చేసి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించామని అన్నారు.












Click it and Unblock the Notifications