కాఫీ వాటాదారుల మేలుకోసం డిజిటల్ పద్ధతులను ప్రారంభించిన కాఫీ బోర్డు
"సాంకేతికతను మంచి పనికోసం వినియోగిస్తే సమాజంలో ఎన్నో ఆశాదృక్పథమైన మార్పులు తీసుకురావచ్చు. సాంకేతికత ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటామన్నది మనపై ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా కాఫీ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది రైతులకు ఈ సాంకేతికత అందించడం ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించిన వారమవుతాం. ఈ టెక్నాలజీని వినియోగించడంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. ఇంకా తక్కువ సమయంలోనే సాంకేతికత వినియోగంపై సుదూరంగా ప్రయాణించాల్సి ఉంది"అని కాఫీబోర్డు సీఈవో మరియు సెక్రటరీ శ్రీవాత్స కృష్ణ అన్నారు.
సెప్టెంబర్ 4, 2018న ఆవిష్కరించిన అప్లికేషన్లు బ్లాక్ చైన్ టెక్నాలజీలో వినియోగించడం దేశంలోనే తొలిసారి అవుతుంది. సమస్యలను త్వరతగతిన పరిష్కారం చూపేందుకు ఐవీఆర్ ఆపరేషన్స్ కూడా చేపట్టినట్లు కృష్ణ చెప్పారు.

ఈ సందర్భంగా డ్రోన్లను వినియోగించి వ్యవసాయం ఎలా చేయాలో ప్రదర్శించడం జరిగింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్ ఆపరేషన్లను ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా కాఫీ పంటలపై నీరు చల్లారు. ఇలా డ్రోన్ల టెక్నాలజీ వినియోగించి వ్యవసాయం చేసేందుకు క్విడిచ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ మరియు స్టార్క్ డ్రోన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి.

కాఫీ కనెక్ట్ పేరుతో కొత్తగా మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా కాఫీ బోర్డుకు సంబంధించిన పలు సేవలు పొందడంతో పాటు ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్న్‌మెంట్ సహకారంతో కాఫీ బోర్డు ఈ యాప్‌ను తయారు చేసింది.

కాఫీబోర్డు EKA అనలిటిక్స్ పెస్ట్ ఐడెంటిఫికేషన్ మొబైల్ యాప్ ప్రారంభం కాఫీ కృషి తరంగా ఆవిష్కరణ, తక్కువ సమయంలో బోర్డు సేవలు ఎక్కువగా పొందేందుకు ఐవీఆర్ఎస్ మొబైల్ ఎక్స్‌టెన్షన్ సేవలు ప్రారంభం శాశ్వత కాఫీ ఉత్పత్తి కానీ, వ్యవసాయ సమస్యలపై కానీ , వర్షాభావ సమస్యలు, పంటకు పురుగు పట్టడంలాంటి సాంకేతిక సమాధానాలు గుర్తించిన తర్వాత EKA అనలిటిక్స్ సహకారంతో కాఫీబోర్డు మరికొన్ని అప్లికేషన్లు రూపొందించింది. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన వాటిని పరీక్షిస్తున్నారు. హైపర్ లోకల్ వెదర్ ఫోర్‌కాస్ట్, పెస్ట్ ఐడెంటిఫికేషన్ అప్లికేషన్, లీఫ్ రస్ట్ డిసీస్ ఫోర్ కాస్ట్, బ్లాక్ చైన్ బేస్డ్ మార్కెట్ ప్లేస్ యాప్‌లు కాఫీ బోర్డు తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications