పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు, కీలక మంత్రాంగం..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం.. కూటమిలో కొత్త నిర్ణయాలకు సిద్దమైంది. అటు వైసీపీ సైతం ఏపీలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కొత్త వ్యూహాలను ఖరారు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామ ర్శించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కల్యాణ్ నివాసానికి సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు వెళ్లనున్నారు. పవన్‌ను కలిసి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసు కోనున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి.. గత 10 రోజులు గా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే విధంగా నంది హిల్స్‌లో ఇటీవల మరణించిన రీజెన్సీ సెరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. గత నెలలో పాలనా పరమైన అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

పవన్ కు పరామర్శ
ఆ వెంటనే శస్త్రచికిత్స చేసిన అనంతరం పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, దీర్ఘకాలం పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో.. పవన్ ను పరామర్శించేందుకు చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లనున్నారు. గతంలోనూ పవన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న సమయంలో చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అస్వస్థత కారణంగా పవన్ కీలక సమావేశాలు.. కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. కాగా.. పవన్ పరామర్శ సమయంలో రాష్ట్రంలో తాజా పరిస్థితుల పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు ఈ మేరకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కూటమి పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications