విజయ్ కు వారి మద్దతు అడ్డుకుంటున్న 'అదృశ్య శక్తి'-సైలెంట్ ఆపరేషన్..!!
తమిళనాడులో ప్రజలు విజయ్ కు పట్టం కట్టారు. కానీ, పట్టాభిషేకానికి మాత్రం సమయం కలిసి రావటం లేదు. 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన టీవీకే మెజార్టీ కి అవసరం అయిన 118 స్థానాలు నిరూపించుకోవటంలో తల కిందులు అవుతోంది. గవర్నర్ 118 సంఖ్యా బలంతో వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తేల్చి చెప్పారు. కాగా, మూడు పార్టీలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. నిర్ణయం ప్రకటించ లేక పోతున్నాయి. దీంతో.. వీరిని అపుతుంది ఎవరు.. ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
విజయ్ 108 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్ల సంఖ్యా బలం ఉండాలి. టీవీకే గెలిచిన 108 స్థానాల్లో విజయ్ గెలిచినవి రెండు ఉండటంతో 107 గా సంఖ్యా బలం ఉంది. అయితే, ఇంకా 11 స్థానాలు కావాలి. కాంగ్రెస్ నుంచి అయిదు స్థానాలు మద్దతు గా చేరాయి. దీంతో.. మరో ఆరు స్థానాలు అవసరం. ఇందు కోసం వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2 స్థానాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ భావించారు. ఆ మూడు పార్టీలు సైతం తొలుత తమ మద్దతు ప్రకటించాయి. అయితే, మారుతున్న లెక్క లు.. సమీకరణాలతో వారు వైఖరి మార్చుకున్నారు. వీసీకే ప్రస్తుతం విజయ్ కు మద్దతు ఇవ్వటం పై సస్పెన్స్ కొనసాగుతోంది. వామపక్షాలు నిర్ణయం తేల్చటం లేదు.

నేడు తేలిపోనున్న విజయ్ కు మద్దతు వ్యవహారం
కాగా.. తాజాగా వీసీకే, వామపక్షాల నేతలు డీఎంకే కూటమితో ఉన్నాయి. తాజాగా స్టాలిన్ తోనూ సమావేశం అయ్యారు. తాము విజయ్ కూటమిలో చేరే అవకాశం లేదని.. ఆ పార్టీలు చేరితే తనకు అభ్యంతరం లేదని.. అయితే.. భవిష్యత్ గురించి ఆలోచన చేసుకోవాలని స్టాలిన్ సూచించారు. దీంతో.. దాదాపుగా వీసీకే మద్దుతు విషయంలో వెనక్కు తగ్గినట్లు స్పష్టం అవుతోంది. అటు వామపక్షాలు ఈ రోజు సమావేశం అవుతున్నాయి. మద్దతు పైన తమ వైఖరి తేల్చనున్నాయి. వీరి నిర్ణయం ఆధారంగా పావులు కదిపేందుకు AIADMK ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. విజయ్ తో కలిసేందుకు సిద్దంగా ఉన్న తమ ఎమ్మెల్యేలను పళిని స్వామి కంట్రోల్ చేస్తున్నారు. DMK- AIADMK అధిష్టానం చిన్న పార్టీలను నియంత్రిస్తోంది. విజయ్ కు మద్దతు విషయంలో ఇబ్బంది పెట్టటం ద్వారా తాము కలవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనే విధంగా సీన్ క్రియేట్ చేసే విధంగా పావులు కదుపుతున్నాయి. దీంతో.. ఈ రోజు విజయ్ కు మద్దతుగా నిలిచే పార్టీల పైన స్పష్టత రానుంది. ఆ తరువాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications