అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ?
నిన్న సాయంత్రం వరకూ ఇరాన్ (iran) నాగరికత లేకుండా చేస్తానని బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump).. డెడ్ లైన్ ముగియడానికి రెండు గంటల ముందు సీజ్ ఫైర్ కు అంగీకరించక తప్పలేదు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్నవార్ కు తాత్కాలిక విరామం లభించింది. అయితే రెండు వారాలుగా ఇరాన్ తో సీజ్ ఫైర్ కోసం మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ (pakistan) ముందుకు రావడం, చర్చలు జరపడం వల్ల ఇప్పుడు సీజ్ ఫైర్ కూ ఆ దేశమే మధ్యవర్తి అని అంతా భావిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని బట్టి చూసినా పాకిస్తానే మధ్యవర్తి అని అనిపించడం సహజం. కానీ కాదన్న నిజం బయటపడింది.
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ వెనుక చైనా (china)
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్తాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొంటున్నా.. చివరి నిమిషంలో చైనా (china) జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసింది. నెలరోజులకు పైగా జరిగిన యుద్ధంలో ఇరాన్ కీలక మిత్రదేశాలలో ఒకటైన చైనా ఒక నిశ్శబ్ద పాత్ర పోషించింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, మద్దతు కోసం చైనాను సంప్రదించాకే ఆ దేశం రంగంలోకి దిగింది. ఇది చైనాకు శాంతిదూత పాత్ర పోషించడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. చివరికి చైనా చొరవతోనే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

అంగీకరించిన ట్రంప్
ట్రంప్ కూడా దీన్ని పరోక్షంగా అంగీకరించారు. చర్చలకు ఇరాన్‌పై ఒత్తిడి తేవడంలో చైనా ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు "అవుననే విన్నాను" అని ట్రంప్ ఏఎఫ్‌పీతో అన్నారు. ఇరాన్‌లో 2వేల మందికి పైగా ప్రాణాలు తీసిన ఈ యుద్ధాన్ని ముగించడానికి ప్రారంభంలో చైనా.. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి మధ్యవర్తులతో కలిసి పనిచేసింది. అయితే, ట్రంప్ గడువు సమీపిస్తుండటంతో, పూర్తిస్థాయి యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో, చైనా నేరుగా ఇరాన్‌తో సంప్రదింపులు జరిపిందని ఇద్దరు చైనా అధికారులు తెలిపారు. దీనిని బట్టి పాకిస్తాన్ కంటే చైనాకు ఇరాన్‌పై ప్రత్యక్ష పట్టు ఉందని తెలుస్తోంది. అయితే, కాల్పుల విరమణలో తన పాత్రపై చైనా అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

చైనా మధ్యవర్తిత్వం ఇలా..
వాస్తవానికి విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్‌లో మాట్లాడారని ఒక ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ట్రంప్ సృష్టించిన మధ్యప్రాచ్య గందరగోళంలోకి నేరుగా వెళ్లకూడదనే చైనా విస్తృత వ్యూహం ప్రకారమే ఇలా వ్యవహరించింది. అయితే చైనా మౌనం ప్రపంచ దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది. మీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు అతనికి ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు అనే శీర్షికతో 'ది ఎకనామిస్ట్' పత్రిక తాజా ముఖచిత్రంపై ఇదే అంశం ప్రచురితమైంది. ఈ పరిణామం చోటుచేసుకున్న సమయం చాలా కీలకమైనది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కోసం ట్రంప్ వచ్చే నెలలో బీజింగ్‌కు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications