ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ?

ఆరువారాలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇవాళ రాత్రి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే యుద్ధంలో కీలకంగా మారిన హార్ముజ్ జలసంధిని ఎలాగైనా తెరిపించాలనే పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ కు 48 గంటల గడువు ఇచ్చారు. దాన్ని ఇప్పటికే ఒక రోజు పాటు పొడిగించారు. అది ఇవాళ రాత్రితో ముగియబోతోంది. అప్పటికీ ఇరాన్ లొంగకపోతే ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ నాశనం చేస్తానని ట్రంప్ వరుస హెచ్చరికలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు (iranians) కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే యుద్దంలో సమిధలుగా మారి నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వీరు.. ఇవాళ ట్రంప్ యుద్ధోన్మానికి నిరసనగా రోడ్లపైకి వచ్చారు. ప్రపంచానికి తమ వేదన తెలియజేయాలని అనుకుంటున్నారు. ట్రంప్ యుద్ద పిపాసను ఖండిస్తూ విన్నూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. వీటిలో విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవహారాల ఏర్పాటు, సంగీత ప్రదర్శనలు వంటివి ఉన్నాయి.

Iranians Form Human Chains Around Power Plants plays music to Defy Trump s Ultimatum

ఇరాన్ లో ఇవాళ అలీ ఘంసారి అనే సంగీత విద్వాంసుడు...అమెరికా దాడులు జరిగే అవకాశం ఉన్న ఓ పవర్‌ప్లాంట్ ముందు కూర్చుని సంగీతాన్ని వినిపించారు. శాంతి కోరుకుంటున్న తమపై అమెరికా రుద్దుతున్న ఈ దాడులకు నిరసనగా అలీ ఘంసారి సంగీత ప్రదర్శన చేస్తున్న వీడియోను ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అలాగే వాయువ్య ఇరాన్ లో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ కూటమి ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని బెదిరించడంతో, తబ్రేజ్ లోని థర్మల్ పవర్ ప్లాంట్ బయట ప్రజలు మానవహారం ఏర్పాటు చేశారు. ప్లకార్డులు చేతబూని యుద్దాన్ని ఆపాలని వేడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+