Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం రెండో నెలకు చేరుకుంది. ఈ యుద్దంలో ముందుగా ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెడితే చాలని భావించిన ప్రత్యర్దులకు హార్ముజ్ జలసంధిని మూసేసి ఎదురు ఒత్తిడి పెట్టే స్దితికి ఆ దేశం చేరుకుంది. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధిని (strait of hormuz)తెరిపించేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో బ్రిటన్, భారత్ తో పాటు మొత్తం 35 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో నిన్న ఈ 35 దేశాల ప్రతినిధులు వర్చువల్ గా భేటీ అయి హార్ముజ్ జలసంధిని తెరిపించే మార్గాలపై చర్చించారు. ఈ భేటీలో హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో తమకు ఎదురవుతున్న కష్టాల్ని పలు దేశాలు ఏకరువు పెట్టాయి. ఇందులో భారత్ కూడా ఉంది. మన దేశం తరఫున ఈ భేటీకి వర్చువల్ గా హాజరైన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ .. హార్ముజ్ జలసంధిలో నావికుల్ని కోల్పోయిన ఏకైక దేశం తమదే అంటూ వాపోయారు. హార్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలను పునరుద్ధరించడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడంపై జరిగిన ఈ భేటీలో మిస్రీ ఈ ప్రకటన చేశారు.

Strait of Hormuz Talks India Stands Alone as Only Country to Lose Seafarers

బ్రిటన్ నిర్వహించిన ఈ అంతర్జాతీయ వేదికపై 60కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ సమావేశంలో సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని కొనసాగించడం, ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా నిరంతరాయ రాకపోకలను నిర్ధారించడం యొక్క ఆవశ్యకతపై చర్చించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఘర్షణలపై భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యపరమైన సంప్రదింపులకు తిరిగి రావడం ద్వారానే పరిస్థితిని పరిష్కరించగలమని మిస్రీ సూచించారు. ఈ సంఘర్షణ భారతదేశ ఇంధన అవసరాలపై తీవ్ర భారం మోపిందని, గల్ఫ్‌లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల్లో కేవలం భారతీయ నావికులు మాత్రమే మరణించారని మిస్రీ పేర్కొన్నారని విదేశాంగమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+