బీర్ల పై సమ్మర్ ఎఫెక్ట్, ఊహించని విధంగా..!!
వేసవిలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా నముదు అవుతున్నాయి. ఇదే సమయంలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సమ్మర్‌లో బీర్ల సేల్స్ భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.రానున్న కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. దీంతో బీర్ల విక్రయాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. దీంతో బీర్ల కొరత రాకుండా కంపెనీ లు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ స్థాయి అమ్మకాలు ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు. గత ఏడాది మార్చిలో రూ. 3,126 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఈసారి రూ. 3,485 కోట్లకు పెరిగింది. బీర్ల ధరలు పెరిగినప్పటికీ ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వీటిని కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. వేడిని తట్టుకోవడానికి నాన్-చిల్డ్ మద్యం కంటే చల్లని బీర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు ఏకంగా 50.78 లక్షల కేసులకు చేరుకున్న ట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది మార్చిలో 39.05 లక్షల కేసులు అమ్ముడవ్వ గా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 30 శాతం వృద్ది చెందాయి. బీర్ల ధరలు పెరిగినప్పటికీ.. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చిల్డ్ బీర్లను తాగేస్తున్నారు. దీంతో బీర్ సేల్స్ భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు కూడా ఆదాయం గణనీయంగా పెరుగతోంది.

వేసవిలో బీర్ల అమ్మకాలతో భారీగా ఆదాయం
మార్చి 31వ తేదీన ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. ఆ ఒక్క రోజే తెలంగాణలో రూ. 410.87 కోట్ల విలువైన మద్యం అమ్ముడై రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది 543 శాతం అదనపు వృద్ధి కావడం విశేషం. కేవలం 24 గంటల్లోనే 4.38 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడుపోగా.. ఈ సారి 30.67 లక్షల కేసులకు చేరుకున్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2.5 శాతం తగ్గుదల నమోదైందని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది మార్చిలో రూ.3,485 కోట్ల ఆదాయం మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రాగా.. గత ఏడాది రూ.3126 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఏకంగా 11.49 శాతం వృద్ది నమోదైందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications