తెలంగాణ నూతన డీజీపీ గా.. సీఎం రేవంత్ అనూహ్య ఎంపిక..!!

తెలంగాణ నూతన డీజీపీ ఖరారయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ కొత్త డీజీపీ ఎంపిక పైన తన మార్క్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా కొత్త డీజీపీ విషయంలో నిర్ణయం జరిగింది. మే 1 నుంచి తెలంగాణ కొత్త డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌ స్థానంలో డీజీపీ స్థాయి అధికారిణి శిఖా గోయల్‌ను నియమించింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దాంతో, సీవీ ఆనంద్‌ స్థానంలో శిఖా గోయల్‌ను నియమించడంతో.. ఆమె నియామకం కూడా మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఆనంద్‌కు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో తదుపరి డీజీపీ ఆయనేనని స్పష్టం చేసినట్లు అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న శిఖా గోయల్‌ను హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూనే.. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీల అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్టీజోన్‌-2 అదనపు డీజీగా ఉన్న దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ను విజిలెన్స్‌ విభాగం డీజీగా నియమించారు.

cv-anand-is-set-to-be-appointed-as-the-new-director-general-of-police-of-telangana-here-the-details

మే 1వ తేదీ నుంచి నూతన డీజీపీగా

ప్రస్తుతం మల్కాజిగిరి కమిషనర్‌గా ఉన్న అవినాష్‌ మహంతిని డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం డీజీగా నియమిస్తూ.. అక్కడున్న షానవాజ్‌ ఖాసింను మల్టీజోన్‌ 2 ఐజీపీగా బదిలీ చేశారు. అవినాష్‌ మహంతికి ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీలో డైరెక్టర్‌గా పని చేస్తున్న తరుణ్‌ జోషిని ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా ఉన్న సుధీర్‌బాబు ఈనెల 30న రిటైర్‌ అవుతున్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్‌గా ఉన్న బి.సుమతిని మల్కాజిగిరి కమిషనర్‌గా నియమించారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న కార్తికేయను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సీవీ ఆనంద్ హైదారబాద్ పోలీసు కమిషనర్ గానూ పని చేసారు. సమర్ధతగల అధికారిగా ఉన్న గుర్తింపు ఉన్న ఆనంద్ కు ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+