అంగన్వాడీలకు శుభవార్త .. త్వరలోనే ఆ పోస్టులు భర్తీ!

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలను బలోపేతం చేసే దిశగా పని చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని శాఖలలో సమస్యలను పరిష్కరించి, శాఖలను బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలో అవసరం అయిన ఉద్యోగా భర్తీపైన కూడా దృష్టి సారిస్తోంది. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకు వెళ్ళటం కోసం కృషి చేస్తోంది.

అంగన్వాడీల విషయంలో మంత్రి శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అయినా అంగన్వాడీల విషయంలో శుభవార్త చెప్పారు.

Good news on anganwadi jobs Telangana Health Minister Damodar Rajanarsimha said about filling jobs

అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.

త్వరలో ఖాళీ పోస్ట్ ల భర్తీ

ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళా సాధికారత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అదేవిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలపై దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ప్రజల సమస్యలు పరిష్కారం చేయటానికి ప్రభుత్వం ముందుంటుందని భరోసా

అలాగే అంగన్వాడీలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తున్నాయని, వారికి పౌష్టికాహారం అందిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, 286మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+