సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ..సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్!

హైదరాబాదులో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే పెరుగుతున్న నగరానికి తగ్గట్టు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవిష్యత్తులో హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ఆధునిక విధానాలు

సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పట్టణీకరణ, జనాభా పెరుగుదలతో వస్తున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ఆధునిక విధానాలను కూడా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా త్రీ లెవెల్ సిస్టంతో ట్రాఫిక్ ను సులభతరం చేయాలని భావిస్తున్నారు.

Hyderabad as Signal-Free City CM Revanth Reddy Plan to control traffic make hyderabad signal free

బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ లు

అండర్ పాస్, సర్ఫేస్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లను అనుసంధానం చేసి ట్రాఫిక్ ను సులభతరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నగరంలో పార్కింగ్ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ట్రాఫిక్ సమస్య కట్టడికి మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు రేవంత్ రెడ్డి.

రాష్ట్ర అభివృద్ధి మూడు భాగాలుగా

మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు, సైక్లింగ్ ట్రాక్ లతో ఏకీకృత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా, ఓఆర్ఆర్ లోకల్ ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా,, మరింత బయట ఉన్న రేర్ ఏరియాను వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేస్తారు.

విజయ్, జగన్ మధ్య గొప్ప పోలిక చెప్పిన రోజా.. విజయ్ కోసం ఏమన్నారంటే!
విజయ్, జగన్ మధ్య గొప్ప పోలిక చెప్పిన రోజా.. విజయ్ కోసం ఏమన్నారంటే!

తెలంగాణా రైజింగ్ మాస్టర్ ప్లాన్ తో ముందుకు

తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలు అమలు అయితే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+