జూబ్లీ హిల్స్ క్రైమ్ లో నేపాలీ ముఠా.. సీపీ సజ్జనార్ నేపాలీ గ్యాంగ్ పై అలెర్ట్!
జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ దారుణ హత్యకు గురయ్యారు . దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే పనిమనిషి కల్పన ఈ హత్యకు కీలక పాత్ర పోషించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కల్పన మరో ఇద్దరితో కలిసి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే సతీమణి తనూజ హత్య కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ దారుణం మే 8, 2026 తెల్లవారుజామున రెండు గంటలకు జరిగిందని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని, ప్రాథమిక సమాచారాన్ని ఆయన మీడియాకు తెలిపారు.

నేపాలీ ముఠా ప్రమేయం ఉందన్న సీపీ సజ్జనార్
ప్రాథమిక విచారణలో నేపాలీ ముఠా ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్టు cp సజ్జనార్ తెలిపారు. ఇంట్లో పనిచేస్తున్న కల్పన (నేపాలీ మహిళ) సహాయంతో బయటి దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులు ఇంటి వెనుక గేటు నుండి లోనికి ప్రవేశించారని స్పష్టం చేశారు. ఘటన సమయంలో పిల్లలు పై అంతస్తులో నిద్రించగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు.
చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణ హత్య
చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి ఆమెను దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.
నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలన్న సీపీ సజ్జనార్
నేపాలీ పనిమనుషులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వారు నేరాలకు పాల్పడతారని, ఏడాది, రెండేళ్లుగా పని చేసినా వారి పైన నిఘా తప్పనిసరి అన్నారు. బెంగళూరు, ముంబై, పుణేలోనూ ఇలాంటి నేరాలు జరుగుతాయని గుర్తుచేస్తూ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications