కవితకు ఈసీ గుడ్ న్యూస్..! కేసీఆర్, బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ బీఆర్ఎస్ కు ఇవాళ మరో షాక్ తగిలింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె కవిత (Kavitha) పెట్టుకున్న కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలకు ఈసీ చెక్ పెట్టింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ గా కొనసాగింపుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కవిత ఇకపై టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ నడుపుకోవచ్చు.

కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేశాక టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న కవిత ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కవిత పెట్టుకున్న పార్టీకి తెలంగాణ రక్షణ సేన పేరుతో అబ్రిబేషన్ ఇచ్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవిత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది దీంతో ఇవాల అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి వచ్చి అధికారిక పత్రాలు సమర్పించారు.

Kavitha Gets EC Nod for TRS Name KCR s Daughter Now Fights Father s Party With His Own Brand

ఈనెల 25న మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పాత పేరు టీఆర్ఎస్ కావడం, ఇప్పుడు కవిత అదే పేరుతో జనంలోకి వెళ్తే బీఆర్ఎస్ కు నష్టం తప్పదన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కవితకు భారీ ఊరటనిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలకూ ఇదో బిగ్ షాక్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+