నాడు పవన్‌పై తిట్లు.. నేడు పార్టీ పేరు "కాపీ" కొట్టిన కవిత!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ శైలిని తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. ఇప్పుడు ఆయన బాటలోనే తనదైన 'సేన'తో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇద్దరు నేతల పార్టీల పేర్లలోనూ 'సేన' అనే పదం ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'పార్ట్ టైమ్' పొలిటీషియన్ అంటూ చురకలు..
గతంలో కవిత పవన్ కల్యాణ్‌పై అనేకసార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ షూటింగ్‌ల విరామంలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయనది "పార్ట్ టైమ్ పాలిటిక్స్" అని కవిత ఎద్దేవా చేసేవారు. "రాజకీయాలు అంటే సినిమా సెట్ కాదు, 24 గంటలు ప్రజల్లో ఉండాలి" అంటూ హితబోధ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఇష్యూపై పవన్ వైఖరిని ఎండగడుతూ, ఆయన కేవలం ప్రశ్నిస్తాను అని చెప్పడమే తప్ప, పరిష్కారాలు చూపడం లేదని విమర్శించేవారు.

నేడు కవిత కొత్త అడుగు..
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో 'తెలంగాణ జాగృతి' ద్వారా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన కవిత.. ఇప్పుడు రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన' పేరుతో పార్టీని ప్రకటించారు. పవన్ తన పార్టీకి 'జనసేన' అని పేరు పెడితే.. ఇప్పుడు కవిత కూడా తన రాజకీయ ప్రయాణానికి 'సేన' అనే పదన్నే ఎంచుకోవడం ఆసక్తికరమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రెండు 'సేన'ల మధ్య పోలికలు..
జనసేన.. సామాజిక మార్పు కోసం, ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అని పవన్ కల్యాణ్ చెబుతారు. తెలంగాణ సెంటిమెంట్, మహిళా సాధికారత, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలంగాణ జాగృతి నెట్‌వర్క్‌ను వాడుకుని రాజకీయంగా ఎదగాలని కవిత భావిస్తున్నారు. మరి అటు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ 'జనసేన' తన ప్రభావాన్ని చూపిస్తుండగా, ఇటు తెలంగాణలో కవిత ఏర్పాటు చేయబోయే 'సేన' ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు ఒకరి సిద్ధాంతాలను, వారి రాజకీయ ప్రయాణాన్ని తీవ్రంగా విమర్శించిన వారే.. కాలక్రమేణా అదే తరహా పంథాను ఎంచుకోవడం పొలిటికల్ గా జరిగేదే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications