స్టార్ హోటల్స్ లో ఏఐ .. హౌస్ కీపింగ్ లో మానవ సామర్ధాన్ని మించి..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోటల్ రంగాన్ని శాసిస్తుంది అనే చెప్పాలి. స్టార్ హోటల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హౌస్ కీపింగ్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. హోటల్స్ కి వచ్చే అతిధుల అనుభవాన్ని మెరుగు పరచడంతో పాటు, హౌస్ కీపింగ్ సామర్ధ్యాన్నిపెంచుతుంది. ఏఐ హౌస్ కీపింగ్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్టార్ హోటల్స్ లో పనిని ఏవిధంగా సులభతరం చేస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

స్టార్ హోటల్స్ హౌస్ కీపింగ్ లో ఏఐ పాత్ర

స్టార్ హోటల్స్ లో ఆటోమేటెడ్ షెడ్యూల్ ద్వారా అతిధుల చెకిన్, చెక్ అవుట్ టైమ్స్, గదుల యొక్క ప్రాధాన్యత, సిబ్బంది పని డేటాను విశ్లేషించి హౌస్ కీపింగ్ షెడ్యూల్ ను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ ఏఐ పనిచేస్తుంది. అంతేకాదు స్టార్ హోటల్స్ లో గదులను క్లీన్ చేయడానికి కూడా రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రధానంగా కనిపిస్తుంది.

AI in a star hotels surpasses human ability in housekeeping

ఏఐ ఆధారిత రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లు

స్టార్ హోటల్స్ లో టైలోస్, గాసియం వంటి ఏఐ ఆధారిత రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లు గదులను కారిడార్లను స్వయంచాలకంగా శుభ్రంచేస్తూ వాటికి అడ్డు వచ్చే వాటిని తొలగిస్తూ, వాటికవే నావిగేట్ చేసుకుంటూ మానవజాతి లేకుండా పనిచేస్తున్నాయి. ఇది మాత్రమే కాదు స్టార్ హోటల్స్ లో ఏఐ సెన్సార్ గదులలోని సామాగ్రిస్థితిని పర్యవేక్షిస్తూ ఎయిర్ కండిషనర్ కానీ ఎలివేటర్ కానీ రిపేర్ వచ్చినప్పుడు ముందుగానే సమస్యలను గుర్తించి సిబ్బందికి సమాచారాన్ని అందజేస్తున్నాయి.

మనుషుల కంటే 30శాతం వేగంగా హౌస్ కీపింగ్

ఇది మాత్రమే కాదు వాయిస్ ఆధారిత చాట్ బాట్ల ద్వారా హౌస్ కీపింగ్ అభ్యర్థనలు తీసుకుంటూ అతిధుల గదులను శుభ్రం చేస్తున్నాయి. లాండ్రీ అవసరాలను సిబ్బంది అవసరాలను అంచనా వేయడంతో పాటు వనరుల వృధాను తగ్గిస్తూ ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీలు హౌస్ కీపింగ్ పనులను చకచకా నిర్వహిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం వల్ల సాధారణం కన్నా 30శాతం వేగంగా హౌస్ కీపింగ్ పనులు జరుగుతున్నాయని సర్వే తేల్చింది.

వ్యక్తుల కంటే 15% అతిథుల సంతృప్తిని పెంచిన ఏఐ

అంతేకాదు సంతృప్తి విషయంలో కూడా ఏఐ వ్యక్తుల కంటే 15% అతిథుల సంతృప్తిని పెంచాయని పేర్కొంది. ఏఐ ద్వారా మానవ వనరుల పై ఆధారపడడం తగ్గటమే కాకుండా, హోటల్ రంగంలో పనిని సులభతరం చేయడానికి ఏ ఐ ని ఉపయోగించడం నిజంగా ఒక శుభ పరిణామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+