ఏఐ సంచలనం: 2050లో కంటెంట్ క్రియేటర్లు ఇలా కనిపిస్తారా?

Artificial Intelligence: నేటి తరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రికెటర్లు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ భవిష్యత్తులో వారి రూపురేఖలు మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫోన్లో నిమగ్నమై ఉండే వారి భవిష్యత్తు స్వరూపాన్ని చూపించడానికి ఒక ఏఐ మోడల్ ను రూపొందించారు. దీని ఫలితాలు చాలా భయంకరంగా ఉన్నాయి.

ఏఐ మోడల్ ఏం చూపిస్తోంది?
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. గ్యాంబ్లింగ్ సైట్ Casino.org నిపుణులు ఓ ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను సృష్టించారు. 2050 నాటికి కంటెంట్ క్రియేటర్లు ఎలా కనిపిస్తారో ఈ ఏఐ మోడల్ చూపిస్తుంది. ఈ మోడల్‌కు 'ఎవా' అని పేరు పెట్టారు. దీని ప్రకారం, భవిష్యత్తులో కంటెంట్ క్రియేటర్లకు చర్మంపై మచ్చలు, వెన్నెముక వంకరగా మారడం (hunchback), నిరంతర మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

AI Model Reveals How Content Creators Will Look in 2050 Tech Neck Skin Issues and More

భయంకరమైన మార్పులకు కారణాలు ఇవే...

వంకర మెడ (టెక్ నెక్): నిరంతరం ఫోన్‌లో, స్క్రీన్‌పై గంటల తరబడి పనిచేయడం, రింగ్ లైట్స్ కింద ఫోటోలకు ఫోజులివ్వడం వల్ల వారి మెడ ముందుకు వంగి ఉంటుందని, దీనివల్ల మెడ, వెన్నెముకలో తీవ్ర నొప్పి వస్తుందని ఏఐ మోడల్ చూపిస్తుంది. ఈ పరిస్థితిని 'టెక్ నెక్' అని పిలుస్తారు. నిపుణుల ప్రకారం.. ఇన్‌ఫ్లుయెన్సర్లు వారానికి 90 గంటల వరకు పని చేస్తారు. ఇందులో ఎక్కువ సమయం ఫోన్‌పైనే గడుపుతారు. దీని వల్ల మెడ వంగిపోతుందని నిపుణుల అభిప్రాయం

చర్మ సమస్యలు: నిత్యం మేకప్ వేసుకోవడం, వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, వాపు, మచ్చలు వస్తాయని ఎవా మోడల్ వెల్లడించింది. దీంతో పాటు రింగ్ లైట్లు, స్క్రీన్‌ల నుంచి వచ్చే కాంతికి ఎక్కువ సమయం గురికావడం వల్ల చర్మంపై పిగ్మెంటేషన్, చిన్న గీతలు, దీర్ఘకాలిక వాపు వంటివి వస్తాయి. దీనిని 'డిజిటల్ ఏజింగ్' అని పిలుస్తారు.

కంటి సమస్యలు: గంటల తరబడి స్క్రీన్‌లపై కంటెంట్‌ను ఎడిట్ చేయడం, లైవ్‌స్ట్రీమ్ చేయడం వల్ల కళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని వైద్య పరిభాషలో 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' లేదా 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' అంటారు. ఈ సమస్యతో కళ్ళు ఎర్రబారడం, పొడిబారడం, చూపు మసకబారడం, కళ్ల కింద నల్లటి వలయాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని నివారణకు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖం, జుట్టుపై ప్రభావం: ఈ ఎవా ఏఐ మోడల్ ప్రకారం.. ఇన్‌ఫ్లుయెన్సర్లు ముఖానికి తరచుగా వేయించుకునే ఫిల్లింగ్స్ వల్ల వారి ముఖం వికృతంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టుకు చేసే వివిధ రకాల స్టైలింగ్‌లు, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వల్ల 'ట్రాక్షన్ అలోపెసియా' అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం, శాశ్వతంగా బట్టతల రావడం వంటివి జరుగుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ మోడల్ చూపించిన 'ఎవా' చిత్రం కేవలం ఒక భావన మాత్రమే కాదు. ఇది నేటి తరం ఇన్‌ఫ్లుయెన్సర్ల జీవనశైలి వల్ల భవిష్యత్తులో ఏర్పడే దీర్ఘకాలిక ప్రభావాలకు ఒక అద్దం వంటిది. ఇవన్నీ ఒక హెచ్చరికగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+