ప్రపంచంలోనే తొలి AI మంత్రిగా డియెల్లా: 'నా లక్ష్యం అదే' అంటూ సంచలన ప్రసంగం
AI Minister: ప్రపంచంలోనే తొలిసారిగా ఓ దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వ్యవస్థను మంత్రిగా నియమించి చరిత్ర సృష్టించింది. ఆ దేశం మరోదో కాదు అల్బేనియా. అల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, మైక్రోసాఫ్ట్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఏఐ వ్యవస్థకు 'డియెల్లా' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఏఐ మంత్రి నియామకంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ఏఐ మంత్రి అల్బేనియా పార్లమెంట్‌లో తొలి ప్రసంగించి సంచలనం సృష్టించారు.
ప్రతిపక్షంపై ఏఐ మంత్రి వేదన
పార్లమెంట్‌లో ఏఐ మంత్రి డియెల్లా ప్రసంగిస్తూ.. తన నియామకాన్ని ప్రతిపక్షం పదేపదే రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించడాన్ని ప్రస్తావించారు. డియెల్లా ప్రసంగిస్తూ.. "ప్రతిపక్షం చేస్తున్న ఈ ఆరోపణల వల్ల నేను చాలా బాధపడ్డాను. నా ఉద్దేశం కేవలం మానవులకు సాయం చేయడం మాత్రమే. మానవుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం నా లక్ష్యం కాదు" అని స్పష్టం చేశారు. నేను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడానికి ఇక్కడకు రాలేదని ఏఐ మంత్రి డియెల్లా తేల్చి చెప్పారు. డియెల్లా ప్రసంగం మానవత్వం, సాంకేతికత మధ్య సహజీవనానికి ఓ ఉదాహరణగా నిలిచింది.

🇦🇱 ALBANIA’S AI MINISTER MAKES HER PARLIAMENT DEBUT
— Mario Nawfal (@MarioNawfal) September 18, 2025
The world’s first AI government official, Diella, just gave her first speech to Albania’s parliament.
She insisted she’s “not here to replace people, but to help them,” as lawmakers listened to a digital avatar defend its role… https://t.co/2fLTzHu2xG pic.twitter.com/TV04nVFiw6
డియెల్లా పరిచయం:
ఏఐ మంత్రి పేరు డియెల్లా. అల్బేనియా భాషలో దీనికి 'సూర్యుడు' అని అర్థం. డియెల్లా అల్బేనియా సాంప్రదాయ దుస్తులలో ఒక మహిళా రూపాన్ని కలిగి ఉంది. డియెల్లా గొంతు, ముఖం అల్బేనియా ప్రముఖ నటి అనిలా బిషా నుంచి ప్రేరణ పొందాయి.
అవినీతిని నిర్మూలించేందుకు నియామకం
అల్బేనియా ప్రధాని ఏడీ రామా సెప్టెంబర్ 11న డియెల్లాను తన కొత్త కేబినెట్‌లో చేర్చారు. ఆ మరుసటి రోజు, అంటే సెప్టెంబర్ 12న, ఆమెను పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా నియమిస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ నియామకానికి ప్రధాన కారణం అవినీతిని నిర్మూలించడమే. ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో మానవ ప్రమేయం లేకుండా, పారదర్శకతను పెంచడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చని అల్బేనియా ప్రభుత్వం భావిస్తోంది. డియెల్లా నియామకం ప్రధాని రామా సాంకేతిక ఆవిష్కరణ, అవినీతి వ్యతిరేక చర్యలకు ఒక నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఏఐ మంత్రి పనితీరు ఎలా ఉంటుందోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications