కోడింగ్ వర్సెస్ ఏఐ .! ఇంజనీర్లకు ఎన్విడియా సీఈవో కీలక సూచన..!
ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ దూకుడు కనిపిస్తోంది. మరోవైపు మన ఇంజనీర్లు కోడింగ్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అసలైన సమస్యల పరిష్కారం అలాగే ఉండిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంజనీర్ల పనితీరును ప్రశ్నిస్తూ, వారు భవిష్యత్తులో ఏయే అంశాలపై ఫోకస్ పెట్టాలో సూచించారు. లాస్ వెగాస్ లో జరిగిన సీఈఎస్ ఈవెంట్ లో ఎన్విడియా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తాను ఇంజనీరింగ్ ను ఎందుకు ఎంచుకున్నానో, దశాబ్దాల తర్వాత కూడా అదే తన ఇష్టమైన వృత్తిగా ఎందుకు ఉందో ఎన్విడియా సీఈవో తెలిపారు. మ్యాథ్స్, సైన్స్ పై ఆసక్తి ఉన్న తనకు ఇంజనీరింగ్ సహజంగానే సరిపోయిందన్నారు. ఎంతో మంది తన కెరీర్లను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారని, తాను మాత్రం తనకు పని చేయాలనే ఆసక్తి దగ్గరే ఉండిపోయినట్లు తెలిపారు. మిగతా వృత్తులతో పోలిస్తే ఇంజనీరింగ్ ఎంతో ఉన్నతమైన ప్రొఫెషన్ గా జెన్సెన్ తేల్చేశారు.

టెక్నాలజీని కెరీర్ గా మార్చుకోవాలనుంటున్న విద్యార్ధులు, ఉద్యోగులకు ఎన్విడియా సీఈవో ఓ కీలక సూచన చేశారు. మీ దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆసక్తి, క్రమశిక్షణ, సమస్యల పరిష్కారంపై ఇష్టం ఉంటే చాలన్నారు. అన్నింటికంటే మించి ప్రస్తుతం ఏఐ యుగంలో కోడింగ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. దీని కంటే ఏఐ ద్వారా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని యువ ఇంజనీర్లకు హువాంగ్ సూచించారు.












Click it and Unblock the Notifications