ఏపీలో ఏఐతో భూసమస్యల పరిష్కారం... ఏఐపై చంద్రబాబు ఫోకస్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయని పని అంటూ లేదు. ట్రాఫిక్ కంట్రోలింగ్ వ్యవస్థ నుంచి, అటవీ ప్రాంతాలలో జంతువులను కాపాడే దాకా, ఇటు వైద్య రంగంలోనూ వ్యాధి నిర్ధారణ వద్ద నుండి చికిత్సకు సంబంధించిన అనేక విషయాలను అందించడంలో వైద్యులకు పేషెంట్స్ కు సహాయం చేసేదిగా, ఒక రంగంలో ఏమిటి? అన్ని రంగాలలోనూ ఏఐ దూసుకుపోతుంది.
ఏఐతో భూ సమస్యలకు పరిష్కారం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా వినియోగించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతోకాలంగా తెగని భూ పంచాయతీలకు చెక్ పెట్టాలని భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో త్వరగా భూ సమస్యల పరిష్కారం
భూములకు ఆధార్, సర్వే నెంబర్లతో లింక్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో త్వరితగతిన భూ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులలో 3.99 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నామని చెప్పారు.
ఏపీలో ఏఐ యూనివర్సిటీ
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏఐ ద్వారా ప్రగతి సాధించాలని ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చెయ్యాలన్న దానిపై, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
ఏపీలో పాలనలోనూ ఏఐ
ఏఐ వర్సిటీ ద్వారా విద్య, ఆరోగ్యం, గవర్నెన్స్ లాంటి 16 రంగాల్లో సేవలందించే అవకాశం కలుగుతుందని భావిస్తోంది. ఏఐ యూనివర్సిటీనే పెట్టాలని ఆలోచిస్తున్న ఏపీ ప్రభుత్వం పాలనలో ఏఐని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రెవెన్యూ శాఖలో భూముల సమస్యల పరిష్కారం కోసం ఏఐని వినియోగించాలని భావిస్తుంది.












Click it and Unblock the Notifications