ఆశ్చర్యానికి గురి చేసిన ఏఐ బర్త్ డే వీడియో వైరల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సును ఉపయోగించి అద్భుతాలను సాధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో కృత్రిమ మేధస్సు కారణంగా, మానవ వనరులపైన తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తుంది.

ఏఐ బర్త్ డే వీడియో
ఇప్పటికే ప్రభుత్వ పాలన నుండి, వైద్య రంగంలోనూ, ఐటీ లోను, చివరకు ఇంటి పనులు చేసుకునే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రగతి సాధిస్తే, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన వీడియోలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియో అన్న అనుమానం కలగకుండా, ఒక ఫ్యామిలీ బర్త్ డే వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Surprising AI birthday video goes viral

Take a Poll

అసలేదో ఏఐ ఏదో అర్ధం కానంతగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఓ పుట్టినరోజు వీడియో నిజమైన బర్త్ డే వీడియోని తలపించేలా ఉండడంతో ఆ వీడియోను చూసిన ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇటువంటి ఎన్ని వీడియోలను చూడాలో, అసలు ఏదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేట్ చేసింది ఏదో తెలియక ఎంత తికమక పడాలో అంటూ చర్చిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తిపైన, అది మానవ సమాజాన్ని డామినేట్ చేస్తున్న విధానంపైన కామెంట్స్ చేస్తున్నారు.

భారతీయ జంట పిల్లల పుట్టినరోజు వేడుక ఏఐ వీడియో
తాజాగా సోషల్ మీడియాలో జస్టిన్ మూర్ అనే మహిళ షేర్ చేసిన ఈ వీడియోలో ఒక భారతీయ జంట తమ పిల్లల పుట్టినరోజు వేడుకను ఇంట్లో జరుపుకుంటున్నారు. తల్లి కేక్ తీసుకురావడం, పిల్లలు క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసి వేడుక చేసుకోవడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎప్పుడో పాతకాలం నాటి కెమెరాతో చిత్రీకరించినట్టుగా వింటేజ్ మోడ్లో ఉన్న ఈ వీడియోలోని సన్నివేశాలు చాలా సహజంగా కనిపిస్తున్నాయి.

ఏఐ వీడియో పోస్ట్ చేసిన జస్టిన్ మూర్ అనే మహిళ
ఇది పూర్తిగా ఏఐ సృష్టించిన వీడియో అని ఈ వీడియోను పోస్ట్ చేసిన జస్టిన్ మూర్ తెలిపారు. ఏ ఐ తో హెచ్డీ వీడియోలే కాదు ఇటువంటి వీడియోలను కూడా సృష్టించవచ్చని, భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువగా వస్తాయంటూ ఆమె పేర్కొన్నారు.ఈ వీడియో చూసిన చాలామంది ఇది నిజమైన వీడియో నా కాదా అని తికమక పడుతున్నారు.

భవిష్యత్తులో ఏఐ కి అడ్డు అదుపు ఉండదని కామెంట్స్
అయితే నిజమైన వీడియోల లాగా ఇంత నేచురల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు తయారు చేస్తుండడంతో ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులను సృష్టిస్తుందని కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భవిష్యత్తులో ఏఐ కి అడ్డు అదుపు ఉండదని ఈ వీడియో చూసిన వారందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+