వెంకీమామ వచ్చేశాడు:'ఆదర్శ కుటుంబంతో ఫ్యామిలీ ట్రీట్..!!
ఓ వైపు ఫ్యామిలీ హీరోగా మన్ననలు అందుకుంటున్న విక్టరీ వెంకటేష్.. మరోవైపు మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ కాంబో కలిస్తే ఆ బొమ్మ ఎంత క్రేజీగా ఉంటుందో తెలిసిపోతోంది. ఔను.. విక్టరీ వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతోంది. ఈ సినిమా పేరు "ఆదర్శ కుటుంబం -హౌజ్ నెం.47" షార్ట్‌గా AK 47. ఈ సినిమా పేరులోనే పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి వెంకీమామ ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమా షూటింగ్ డిసెంబర్ 10వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది.
వెండితెరపై 'ఫ్యామిలీ హీరో'గా తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఆప్తుడైన విక్టరీ వెంకటేష్, చాలా కాలం తర్వాత మళ్లీ అదే తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' వేసవి 2026లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ప్రతి కుటుంబం తమ కష్టసుఖాలను తెరపై చూసుకునేలా, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది.వెంకటేష్‌ను మళ్లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్తే.

హారికా & హాసిని క్రియేషన్స్ నుంచి మరో విజయం!
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. కంటెంట్, నిర్మాణ విలువల్లో నాణ్యతకు మారుపేరైన ఈ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.
విడుదల ఎప్పుడంటే?
'ఆదర్శ కుటుంబం' చిత్రాన్ని వేసవి కాలం 2026లో గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా వెంకటేష్‌తో కచ్చితంగా త్రివిక్రమ్ కామెడీ పండిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
గతంలో వెంకటేష్ నటించిన పలు ఫ్యామిలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్క్రీన్ పై తన ఎమోషన్స్ పండించి ఫ్యామిలీ లేడీస్ మనసుల్లో వెంకీ స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే ... వెంకటేష్ మళ్లీ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంటారనే విషయం స్పష్టం అవుతోంది.
వెంకటేష్ లాంటి నటుడు కుటుంబ బంధాలు, అనుబంధాలు ప్రధానంగా ఉండే చిత్రంలో నటించడం అంటే, ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తోడైనట్లే. 'ఆదర్శ కుటుంబం' టైటిల్‌లోనే ఎంతో సానుకూలత, వెచ్చదనం కనిపిస్తున్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఫస్ట్‌లుక్‌తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ సినిమా పేరుతెచ్చుకుంది. మరి త్రివిక్రమ్-వెంకటేష్ కాంబోలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో 2026 వేసవి వరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications