నరకం చూపిస్తున్నాడు: భర్తపై గృహ హింస కేసు వేసిన టాలీవుడ్ హీరోయిన్

ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సెలినా జైట్లీ కోర్టుకెక్కారు. తన భర్త, ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు దాఖలు చేశారు. ఏకంగా 50 కోట్ల రూపాయల పరిహారాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె ముంబై అంధేరిలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. గృహ హింస చట్టం కింద ఈ పిటీషన్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తన భర్త పీటర్ హాగ్ మహా క్రూరుడని, రోజూ తనను టార్చర్ పెట్టేవాడుతున్నాడని సెలీనా జైట్లీ.. ఈ పిటీషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. తనను అనేక రకాలుగా మోసం చేశాడని పేర్కొన్నారు. గృహ హింసకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ పిటీషన్ ను ఎస్ సీ టాడ్కే కోర్టు పరిశీలనకు తీసుకుంది. అందులోని వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత.. పీటర్ హాగ్ కు నోటీసులు జారీ చేసింది. సెలినా జైట్లీ వేధింపులకు మాత్రమే కాకుండా.. ఆదాయం, ఆస్తి నష్టానికి కూడా ఆర్థిక పరిహారం కోరుతున్నట్లు తెలుస్తోంది.

Celina Jaitly Files case against Husband

గతంలో తెలుగులో సహా పలు సినిమాల్లో నటించింది సెలీనా జైట్లీ. మంచు విష్ణు తొలి సినిమా సూర్యంలో ఆమెనే హీరోయిన్. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. బాలీవుడ్ లో దాదాపుగా 20కి పైగా సినిమాల్లో మెరిశారు. 2011లో వివాహం చేసుకున్న తర్వాత కూడా అడపా దడపా కొన్ని సినిమాల్లో నటించింది. సెలీనా జైట్లీ- పీటర్ హాగ్ దంపతులకు ముగ్గురు కుమారులు. 2012లో విన్ స్టన్, విరాజ్ అనే కవలలకు జన్మించారు.

2017లో షంషేర్, ఆర్థర్ అనే మరో కవలలకు జన్మనిచ్చారు. గుండె సంబంధిత ఇబ్బందులతో షంషేర్ మరణించాడు. పీటర్ హాగ్ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త, హోటల్ యజమాని. సెలినా జైట్లీ సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీ గురించి కూడా ఇటీవలే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్ లో విక్రాంత్ జైట్లీని యూఏఈలో అక్రమంగా నిర్బంధించారని అప్పట్లో సెలీనా ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+