నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్?

మెగాస్టార్ చిరంజీవికి ఘరానా మొగుడు, నందమూరి నటసింహం బాలకృష్ణకు నరసింహనాయుడు.. ట్రెండ్ సెట్ చేయించిన సినిమాలు. ఘరానా మొగుడు తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా రూ.10 కోట్లు వసూలు చేసిన సినిమా రికార్డు సృష్టించగా, నరసింహ నాయుడు తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా రూ.20 కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇలా రెండు అరుదైన తొలి రికార్డులను ఈ ఇద్దరు అగ్రహీరోలు తమ పేర్లమీద లిఖించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడమేకాదు.. వాణిజ్యవర్గాల లెక్కలను తిరగరాశాయి. చిరంజీవి ఇమేజ్ ఘరానా మొగుడుతో శిఖరం స్థాయికి చేరితే, నరసింహనాయుడితో బాలయ్య ఇమేజ్ పర్వతమంత స్థాయికి చేరింది.

బాలయ్య పౌరుషానికి చిహ్నం

బాలయ్య పౌరుషాన్ని, ఫ్యాక్షన్ ను నరసింహనాయుడు ప్రేక్షకులకు రుచిచూపించింది. వెండితెరపై మాస్ జాతరలాంటిది. బాలయ్య డైలాగులు, రైలును ఛేజింగ్ చేయడం, సుమోలు పేలడంలాంటి సన్నివేశాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయమని చెప్పొచ్చు. మణిశర్మ అద్భుతమైన బీజీఎం అందించడంతోపాటు లక్స్ పాపా, లక్స్ పాపా, నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండుచీమ లాంటి పాటలన్నీ సూపర్ హిట్. బి.గోపాల్ దర్శకత్వం, సిమ్రన్, కె.విశ్వనాథ్ లాంటి తారాగణం.. ఇలా అన్నీ కలిపి ఈ సినిమాను ప్రేక్షకులకు ఆరాధ్య దైవమైన సినిమాగా నిలిపింది.

Narasimha Naidu Gharana Mogudu Which of these two industry hits is the best movie

తెలుగు సినిమా స్థాయిని పెంచాయి

ఘరానా మొగుడు ఒక పక్కా కమర్షియల్ వినోదాల విందు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి రూ.10 కోట్ల వసూళ్ల మార్కును దాటిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నృత్యాలు, బాడీ లాంగ్వేజ్, కీరవాణి సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. "బంగారు కోడిపెట్ట" పాట అప్పట్లో ఒక సంచలనం. సామాన్య కూలీగా చిరంజీవి చూపించిన హీరోయిజం, అహంకారి అయిన నగ్మాను లొంగదీసుకోవడం, పెళ్లిచేసుకోవడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు వేటికవే బెస్ట్ అని చెప్పొచ్చు.

అది చూసేవారి అభిరుచిని బట్టి ఆధారపడివుంటుంది. చిరంజీవి కామెడీ, నృత్యాలు, పాటలు, ఫైట్లు కావాలంటే ఘరానా మొగుడు చూడాలి. అదిరిపోయే డైలాగులు, గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు, ఎలివేషన్లు, బాలయ్య రాజసం లాంటి నడక లాంటివన్నీ కావాలంటే నరసింహనాయుడు చూడాలి. ఒకరకంగా ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+