ఫ్రీ బస్సెక్కిన సమంత
Samantha in Maa Inti Bangaaram: పెళ్లి తర్వాత సమంత ఓ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీతో తెరమీదికి వచ్చారు. సుదీర్ఘ విరామం అనంతరం టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా సినిమా.. మా ఇంటి బంగారం. ఆమె ఫస్ట్ లుక్ వెలువడింది. ఈ సినిమా పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. టీజర్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు టీజర్ ట్రైలర్ విడుదల కానుంది. ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తిని పెంచింది.
తాజా స్టిల్ లో మాస్ లుక్స్ లో అదరగొట్టారు సమంత. ఓ బస్సులో చీరకట్టులో రగ్డ్ అండ్ సీరియస్ లుక్స్ నిల్చున్న స్టిల్ ఇది. ఈ పోస్టర్.. సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. 'ఓ బేబీ' వంటి హిట్ తర్వాత సమంత మళ్లీ దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి పని చేస్తున్నారు.

కాంతారా ఛాప్టర్ 1 ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తోన్నారు. త్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ కింద రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథను సమకూర్చారు.
టైటిల్.. చూడ్డానికి ఫ్యామిలీ టైప్ లో కనిపిస్తోంది గానీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సక్సెస్ కావడంతో ఇదే జానర్ ను సమంత కంటిన్యూ చేస్తోన్నట్టే కనిపిస్తోంది. మా ఇంటి బంగారం'లో బాడీ డబుల్స్ సహాయం లేకుండానే స్టంట్స్ చేయనున్నారు సమంత. సమంత చివరిసారిగా 2025లో కామెడీ హారర్ మూవీ 'శుభం'లో అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెరుపులు మెరిపించనున్నారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications