తెలుగులో 7 సార్లు రూ.200 కోట్లు అందుకున్న ఏకైక హీరో
తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ప్రతి సినిమాతో అద్భుతాలు సృష్టించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, తన స్టార్ పవర్ ఏంటో నిరూపించడంలో రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. 'ది రాజా సాబ్' చిత్రంతో ఆయన మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాకపోయినా, కేవలం ప్రభాస్ ఇమేజ్‌తోనే మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిందంటే అతని స్థాయి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు.
ఏ హీరోకు సాధ్యం కాలేదు
సంక్రాంతి రేసులో ఇతర సినిమాల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ప్రభాస్ ఇమేజ్ తో రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ విజయంతో ప్రభాస్ కెరీర్‌లో ఏకంగా 7వ సారి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఈ సినిమా నిలవడమే కాదు.. తొలి హీరోగా ప్రభాస్ రికార్డు నెలకొల్పారు. తెలుగు సినీచరిత్రలో మరే ఇతర అగ్ర హీరోకు సాధ్యం కాని ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

రూ.200 కోట్లు అనేది సర్వసాధారణంగా వస్తున్నాయి
ప్రభాస్ పాన్ ఇండియా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి తన మార్కెట్ రేంజ్ ఆకాశాన్ని తాకింది. బాహుబలి రెండు సినిమాలు, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి భారీ చిత్రాలన్నీ రూ.200 కోట్లను సునాయాసంగా అందుకున్నాయి. దీంతో ప్రభాస్ను గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. మధ్యలో 'రాధే శ్యామ్' ఒక్కటే రూ.200 కోట్లను అందుకోవడంలో మిస్ అయింది. ఇతర సినిమాలేకాదు.. ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా రూ.200 కోట్లు అందుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.
దరిదాపుల్లోకి కూడా రాలేరంటున్నారు
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నెలకొల్పడం ఖాయమనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', సలార్-2, కల్కి-2 వంటి క్రేజీ ప్రాజెక్టులు డార్లింగ్ చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ చాలా సాధారంగానే రూ.200 కోట్లు వసూలు చేస్తాయి. తొలిరోజు వసూళ్లే రూ.200 కోట్లు ఉండే అవకాశం ఉందంటే ప్రభాస్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. అనేక రికార్డులను కూడా కొల్లగొట్టే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రభాస్ దరిదాపుల్లోకి మరే హీరో కూడా వచ్చే అవకాశం ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications